12 వేల ఆర్టీసీ బస్సులకు జీపీఆర్ఎస్ సిస్టమ్' | GPRS system of aps rtc buses to be held | Sakshi
Sakshi News home page

'12 వేల ఆర్టీసీ బస్సులకు జీపీఆర్ఎస్ సిస్టమ్'

Published Thu, Sep 10 2015 7:06 PM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

GPRS system of aps rtc buses to be held

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 వేల బస్సులకు జీపీఆర్ ఎస్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ సాంబశివరావు తెలిపారు. అక్టోబర్ 12 నాటికి రాష్ట్రంలో అన్ని బస్టాండ్స్ లో ఎయిర్ తరహా విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. ఆధునిక సమాచార వ్యవస్థను ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతామన్నారు.

 

ఈ మేరకు త్వరలో రాష్ట్రంలోని 30 డిపో మేనేజర్లకు  విజయవాడలో రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. మరో 45 రోజుల్లో మిగతా 90 మంది డిపో మేనేజర్లకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్టీసీని ఆదుకోమని ఇప్పటికే సీఎంకు ప్రతిపాదనలు ఇచ్చినట్లు సాంబశివరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement