నోటికాడి పంటనీటిపాలు | Heavy rains damage cotton and paddy crops | Sakshi
Sakshi News home page

నోటికాడి పంటనీటిపాలు

Published Sat, Oct 26 2013 6:09 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM

Heavy rains damage cotton and paddy crops

 

6795 ఎకరాల్లో పత్తి... 1584 ఎకరాల్లో వరి
 =వర్షం ధాటికి దెబ్బతిన్న పంటలు... నేలకూలిన నివాస గృహాలు
 = ఏజెన్సీలో ఉధృతంగా ప్రవహిస్తున్న జంపన్నవాగు... రాకపోకలకు అంతరాయం
 =వరంగల్‌లో ఇళ్లలోకి నీళ్లు... రోడ్లు, భవనాల శాఖకు రూ.20 కోట్ల నష్టం
 =జాతీయ విపత్తుల నివారణ శాఖకు నష్టం అంచనా నివేదించిన కలెక్టర్

 
 వరంగల్, న్యూస్‌లైన్ : వరుస వానలు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రధాన పంటలన్నీ వర్షం ధాటికి దెబ్బతిన్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో 6795 ఎకరాల్లో పత్తి, 1584 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్టు కలెక్టర్ ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రాథమికంగా వేసిన నష్టం అంచనాను జాతీయ విపత్తుల నివారణ కమిషనర్, రెవెన్యూ విభాగానికి పంపించినట్టు తెలిపారు. క్షేత్రస్థాయిలో సర్వే జరుగుతున్నదని, త్వరలోనే పూర్తిస్థాయి నివేదిక పంపిస్తామన్నారు. పది నివాస గృహాలు నేలమట్టం కాగా, 23 ఇళ్లు దెబ్బతిన్నాయని, మరో 109 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమైనట్లు జిల్లా యంత్రాంగం గుర్తించింది.ఏజెన్సీలోని జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తుం డడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించారుు. వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీలు జలమయమయ్యూయి.

చిన్న వడ్డేపల్లి చెరువు, కాశిబుగ్గ, వివేకానంద కాలనీ, శాంతినగర్, పద్మనగర్, ఎంహెచ్ నగర్, సుందరయ్య నగర్, దేశాయిపేట, సమ్మయ్యనగర్, నయీంనగర్, గోపాల్‌పూర్ ప్రాంతాల్లోని పలు ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. ఈనెల 22 నుంచి వరుసగా వర్షం కురుస్తోంది. 23న 11.7 మి.మీ, 24న 23.3 మి.మీ, 25న 28.6 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం అత్యధికంగా గీసుగొండ మండలంలో 92 మి.మీ. వర్షం కురిసింది. అదే విధంగా సంగెంలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తం 51 మండలాల్లో వర్షం కురిసింది. కాగా, కురవిలో పంట నష్టపరిహారం చెల్లించాలంటూ రైతులు ధర్నా చేశారు.  
 
పంట నష్టం అధికంగా ఇక్కడే..

 జనగామ,  నర్మెట్ట, మద్దూరు, చేర్యాల, బచ్చన్నపేట, పరకాల, ఆత్మకూర్, గీసుగొండ, సంగెం, డోర్నకల్, ములుగు, మంగపేట, ఏటూర్‌నాగారం, వర్ధన్నపేట, నర్సంపేట, దుగ్గొండి ఖానాపురం, నల్లబెల్లి  నెక్కొండ, చెన్నారావుపేట మండలాల్లో పంటలకు అధికంగా నష్టం వాటిల్లింది. ములుగులో 100 ఎకరాల్లో మిర్చి పంటకు వర్షాలతో తెగుళ్లు సోకినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. తెగుళ్లతో మిర్చి దిగుబడి తగ్గే అవకాశమున్నట్లు భావిస్తున్నారు. ఇక భూపాలపల్లి సింగరేణి ఓపెన్‌కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

 99 రోడ్లు ధ్వంసం

 ఆర్‌అండ్‌బీ పరిధిలోని వరంగల్, మహబూబాబాద్ డివిజన్‌లో 99 రోడ్లు ధ్వంసమైనట్లు అధికారులు గుర్తించారు. వీటిని శాశ్వతంగా మరమ్మతు చేసేందుకు రూ.20 కోట్లు అవసరమని, తాత్కాలిక మరమ్మతులకు రూ.2.50 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించినట్లు ఎస్‌ఈ మోహన్ నాయక్ చెప్పారు.
 
వర్షపాతం ఇలా..

 జిల్లా వ్యాప్తంగా సగటు వర్షపాతం 28.6 మి.మీగా నమోదైంది. చేర్యాలలో 19.6, మద్దూరులో 25.2, నర్మెట్ట 46.6, బచ్చన్నపేట 20.2, జనగామ 28.4, లింగాలఘణపూర్ 28, రఘునాథపల్లి 34.8, స్టేషన్‌ఘన్‌పూర్ 38.2, ధర్మసాగర్ 42.2, హసన్‌పర్తి 38.2, హన్మకొండ 41.2, వర్థన్నపేట 35.2, జఫర్‌గడ్ 38.2, పాలకుర్తి 46.2, దేవరుప్పుల 52.2, కొడకండ్ల 30.2, రాయపర్తి 22.4, తొర్రూర్ 17.4, నెల్లికుదురు 8.4, నర్సింహులపేట 12.8, మరిపెడ 9.2, డోర్నకల్ 5.4, కురవి 3.6, మహబూబాబాద్ 5.6,  కేసముద్రం 12.2, నెక్కొండ 5.6, గూడూర్ 9.8, కొత్తగూడ 12.2, ఖానాపూర్ 12.2, నర్సంపేట 22.8, చెన్నారావుపేట 10.2, పర్వతగిరి 20.2, సంగెం 62.4, నల్లబెల్లి 12.6, దుగ్గొండి 14.2, గీసుకొండ 92.0 ఆత్మకూరు 32.4,  శాయంపేట 42.0, పరకాల 61.4, రేగొండ 24.0, మొగుళ్లపల్లి 54.6, చిట్యాల 59.2,  భూపాలపల్లి  32.6,  ములుగు ఘన్‌పూర్ 25, ములుగు 14.8, వెంకటాపూర్ 51.6, గోవిందరావుపేట 8.0, తాడ్వాయి 25.2, ఏటూరునాగారం 27.2, మంగపేట 12.8, వరంగల్‌లో 46.2 మి.మీ వర్షపాతం నమోదైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement