శ్రీకాకుళం అగ్రికల్చర్: జిల్లా రైతులపై వరుణుడు కరుణించాడు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కర్షకులు కుసీగా ఉన్నారు. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు జిల్లాలో 730.0 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలతో రైతుల్లో ఖరీఫ్‌పై ఆశలు చిగురిస్తున్నాయి. సీజన్ ప్రారంభమై..వరినారు పోసుకున్న తరువాత వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. నీటి వసతి కలిగిన చోట్ల ఆయిల్ ఇంజన్లతో నారు మడులకు నీరు పెట్టి కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు. నీటి వసతి లేని చోట్ల రైతులు ఆకాశం వైపు ఆర్రులు చాసి చూశారు. గురువారం రాత్రి నుంచి కురిసిన వర్షాలతో ఖరీఫ్ రైతులకు ఊపిరి.. వరి నారుకు జీవం వచ్చింది. అలాగే మెట్టు పంటలైన సజ్జ, మొక్కజొన్న, వేరుశనగ, గోగు, గంటి తదితర పంటలకు ఈ వర్షం ఎంతో మేలు చేయనుంది.
అయితే లోతట్టు ప్రాంతాల్లో వరి విత్తనాలు, వెదలు చల్లిన రైతుల్లో మాత్రం ఆందోళన చెందుతున్నారు. కురుస్తున్న వర్షాలతో పొలాల్లో నీరు నిల్వ ఉండిపోతే విత్తనాలు పాడయ్యే అవకాశం ఉందంటున్నారు. శుక్రవారం జిల్లా మొత్తంగా 730.0 మిల్లీ మీటర్లు, జిల్లా సరాసరిగా 30.2 మి.మీ. నమోదైంది. అత్యధికంగా కవిటి మండలంలో 72.4 మి.మీ, పలాసలో 56.6, ఇచ్ఛాపురంలో 55.4, కంచిలిలో 35.0 మిల్లీమీటర్లు నమోదయింది. అత్యల్పంగా జలుమూరులో 2.2 మి.మీ., శ్రీకాకుళంలో 5.4, ఎల్.ఎన్.పేట మండలంలో 5.6, రణస్థలంలో 6.0 మీల్లీమీటర్లు నమోదయింది. చెరువులు, కుంటల్లో కూడా నీరు చేరింది.
వర్షపాతం వివరాలు మిల్లీమీటర్లలో...
వీరఘట్టం 19.6, వంగర 11.2, రేగిడి ఆమదాలవలస 15.2, రాజాం 12.8, జి. సిగడాం 8.8, లావేరు 11.2, రణస్థలం 6.0, ఎచ్చెర్ల 8.8, పొందూరు 10.2, సంతకవిటి 10.2, బూర్జ 8.4, పాలకొండ 16.0, సీతంపేట 9.2, భామిని 23.2, కొత్తూరు 24.4, హిరమండలం 27.6, సరుబుజ్జిలి 12.8, ఆమదాలవలస 13.8, శ్రీకాకుళం 5.4, గార 9.4, పోలాకి 12.8, నరసన్నపేట 18.2, జలుమూరు2.2, సారవకోట 23.4, పాతపట్నం 29.6, మెళియాపుట్టి 17.2, టెక్కలి 16.2, కోటబొమ్మాళి 18.8, సంతబొమ్మాళి 25.4, నంది గాం 17.8, వజ్రపుకొత్తూరు 12.4, పలాస 56.6, మందస 18.2, సోంపేట 32.2, కంచి లి 35.0, కవిటి 72.4, ఇచ్ఛాపురం 55.4, ఎల్.ఎన్.పేట 5.6 మి.మీ. నమోదైంది.
కరుణించిన వరుణుడు
Published Sat, Jul 19 2014 4:09 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement