విశాఖపట్నం: పగటి పూట ఎండ, రాత్రి వేళ చలితో ఏపీ, తెలంగాణల్లో విచిత్ర వాతావరణం నెలకొంది. ఫిబ్రవరి నెలంతా ఇలాగే ఉంటుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు ఏపీలో 30-35 డిగ్రీలు, తెలంగాణలో 30-35 డిగ్రీల మధ్య నమోదవుతుండగా, కనిష్ట ఉష్ణోగ్రతలు ఏపీలో 13-19 మధ్య, తెలంగాణలో 13-20 డిగ్రీలుగా రికార్డవుతున్నాయి.
గరిష్ట ఉష్ణోగ్రతలు తెలంగాణలో సాధారణం కంటే 2-3 డిగ్రీలు, ఏపీలో 1-2 డిగ్రీలు అధికంగా, కనిష్ట ఉష్ణోగ్రతలు తెలంగాణలో 2-4 డిగ్రీలు, ఏపీలో 2-6 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడంతో ఇక పై భానుడి ప్రతాపం అధికమవుతుందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం మాజీ అధికారి ఆర్.మురళీకృష్ణ 'సాక్షి'కి తెలిపారు.
పగలు వేడి.. రాత్రి చలి
Published Fri, Feb 6 2015 1:47 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement
Advertisement