
మళ్లీ చితికిన టమాటా
చేవెళ్ల మార్కెట్లో 25 కిలోల బాక్సు రూ.50 నుంచి రూ.80 మాత్రమే
చేవెళ్ల, న్యూస్‌లైన్: టవూట పంట దిగుబడి వచ్చే సవుయుంలో ధర 90శాతం పడిపోవడంతో రైతులు కన్నీటి పర్యంతవువుతున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మార్కెట్‌లో సరిగ్గా 20 రోజుల క్రితం.. 25 కిలోల టమాటా బాక్సు ధర రూ.600. ఇప్పుడది రూ.50 నుంచి రూ.80 మాత్రమే. రైతుల చేతికి దిగుబడి వచ్చే సమయంలోనే ధర ఒక్కసారిగా పతనమైంది. నెల క్రితం ధరలు చూసి టమాటా రైతులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ధర చూసి లబోదిబోమంటున్నారు.
స్థానిక హోల్‌సేల్ మార్కెట్లో కిలో ధర రూ.2.50 నుంచి రూ.3 వూత్రమే ఉంది. ఈ ధరతో కనీసం కూలీలు, రవాణా చార్జీలు కూడా రావడంలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా క్రమంగా పతనమవుతూ వస్తున్న ధర శుక్రవారం అమాంతం పడిపోయింది. ఈ ధరతో కూలీలకు చార్జీలు కూడా చెల్లించలేమని రైతులు వాపోతున్నారు. అయితే, టమాటాను తమ వద్ద తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్న వ్యాపారులు హైదరాబాద్, కరీంనగర్ తదితర మార్కెట్లకు తరలించి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని రైతులు వాపోయూరు.