గుట్టుగా ఇంటి దొంగలు | Hill house robbers | Sakshi
Sakshi News home page

గుట్టుగా ఇంటి దొంగలు

Published Fri, Dec 5 2014 2:45 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

Hill house robbers

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎర్రచందనం అక్రమ రవాణాలో కీలకంగా ఉన్న బడా నాయకులు, కొందరు పోలీసులు గుట్టుగా తమ పని కానిచ్చేస్తున్నారు. తమకు సంబంధం లేనట్టు వ్యవహరిస్తూ.. స్మగ్లింగ్‌లో సహకరించిన వారిని కాపాడుకునే పనిలో నిమగ్నమైనట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు ఓ మాజీ డీఎస్పీని రంగంలోకి దింపినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎర్రచందనం అక్రమరవాణాలో ఇంటిదొంగల భరతం పట్టేందుకు పోలీసు ఉన్నతాధికారులు తనదైన శైలిలో విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే.
 
 అనుమానం ఉన్న అధికారుల గురించి ఆరా తీస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఎర్రదొంగలు కేసులను నీరుగార్చేందుకు పూనుకున్నారు. గూడూరు డివిజన్‌లో ఓ మాజీ డీఎస్పీ మూడు రోజుల పాటు మకాం వేసి ఎర్రచందనం అక్రమరవాణాలో భాగం ఉన్న పోలీసులను పిలిపిం చుకుని భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చినట్లు తెలిసింది. గతంలో ఎర్రచందనం కేసులో నిందితుడిగా దొరికిన ఓ వ్యక్తిని తప్పించడంలో ఓ కానిస్టేబుల్ ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. 14 ఏళ్ల పాటు ఒకే డివిజన్ సర్కిల్ పరిధిలో విధులు నిర్వహించి ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న ఐడీ పార్టీ కానిస్టేబుల్‌పై విచారణ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే ఆ కానిస్టేబుల్‌ను విచారిస్తే తమ గుట్టురట్టవుతుందని అక్రమరవాణా వెను క ఉన్న బడా బాబులు ఉలిక్కిపడ్డారు. కానిస్టేబుల్ నోరు తెరిస్తే పలువురు ఉన్నతాధికారులతో పాటు నేతల పేర్లు బయట పడే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో కేసును నీరుగార్చి ఆ పోలీస్‌ను పక్కకు తప్పించే యత్నాలను ముమ్మరం చేశారు.
 
 అక్రమరవాణాలో పెద్దల హస్తం
 జిల్లా పరిధిలో జరిగిన ఎర్రచందనం అక్రమరవాణాలో టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రికి సన్నిహితంగా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త, గతంలో జిల్లాలో పనిచేసిన ఓ డీఎస్పీ, రూరల్ పరిధిలో పనిచేసిన సీఐ, మరి కొందరు ఎస్సైల పాత్ర ఉన్నట్లు తెలిసింది. వీరంతా ఆ కానిస్టేబుల్‌ని కాపాడే పనిలో నిమగ్నమైనట్లు పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.
 
  బదిలీపై హైదరాబాద్‌కు వెళ్లిన ఆ డీఎస్పీ మూడు రోజులుగా ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మకాం వేసి ఎర్రచందనం కేసుకు సంబంధించి ఉన్నతాధికారులతో పాటు, ప్రజాప్రతినిదులతో మాట్లాడి కానిస్టేబుల్‌ను పక్కకు తప్పించమని హుకుం జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. బదిలీ అయిన డీఎస్పీ ఎందుకు వచ్చారని పలువురు అనుమానం వ్యక్తం చేయగా... పెండింగ్‌లో ఉన్న రికార్డులను చూసేందుకు వచ్చారని చెప్పుకుంటున్నారు.  రికార్డులు చూసేందుకు వచ్చినట్లయితే కార్యాలయంలోనే పనులు పూర్తి చేసుకోవాల్సి ఉండగా అతిథిగృహంలో ఉండి పనులు చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
 
 దొరికింది కొందరే...
 దొరికిని వారు దొంగలు.. దొరకని వారు దొరలుగా చలామణి అవుతున్నారు. ప్రస్తుతం జిల్లా పరిధిలో పట్టుబడిన ఎర్రదొంగలు చిన్న చేపలేనని ప్రచారం జరుగుతోంది. స్మగ్లింగ్‌లో నాయకులు, అధికారులు కలసి పనిచేస్తూ కోట్లకు పడగలెత్తారు. ఇటీవల పోలీసులకు చిక్కిన అంబూరు కృష్ణ సూళ్లూరుపేట వద్ద దామానెల్లూరుకు చెందిన వ్యక్తి. ఇతను 20 ఏళ్ల క్రితం నెల్లూరుకు వచ్చారు. గుప్తాపార్క్ సమీపంలో నివాసం ఉంటున్నారు. ఎర్రచందనం అక్రమరవాణాపై దృష్టిపెట్టాక కోట్ల రూపాయలను వెనుకేసుకున్నట్లు సమాచారం. ఆ సొమ్ముతో సంగం, వెంకటగిరిలో కొంత భూమిని కొనుగోలు చేసి ప్లాట్లు వేసి రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేసేవారని చెపుతున్నారు. ఇంకా చెన్నై, బెంగుళూరు, గుత్తిలోనూ పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్లు పోలీసు వర్గాలు గుర్తించారు. డక్కిలి మండలం లింగసముద్రం వద్ద సుమారు 20 ఎకరాల ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసి తరువాత విక్రయించినట్లు స్థానికులు చెపుతున్నారు. అదే విధంగా కలువాయికి చెందిన సుబ్బారెడ్డి, రాపూరు మండలం పెరచర్లకు చెందిన సాంబశివారరెడ్డి, అనంతసాగరానికి చెందిన ఈశ్వరరెడ్డి టీడీపీ అనుచరులు. పార్టీ అధికారంలోకి రాకముందు గుట్టుచప్పుడు కాకుండా ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలించేవారని ఆరోపణలు ఉన్నాయి.
 
  సాంబశివారెడ్డి కడప జిల్లాకు చెందిన వారైనా.. పెగచర్లలో వివాహం చేసుకున్నాడు. ఇల్లరికం వచ్చిన ఇతను గత కొన్నేళ్లుగా ఎర్రచందనం అక్రమరవాణా చేసి రెండస్తుల భవనం, కొంత పొలం కొనుగోలు చేసినట్లు తెలిసింది. వీరు టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ అక్రమరవాణాను విస్తరించినట్లు తెలుస్తోంది. చెన్నై, బెంగుళూరు, ముంబై, హైదరాబాద్‌లోని బడా స్మగ్లర్లతో ఒప్పందం కుదుర్చుకుని దుం గలను తరలించేవారని తెలిసింది. వీరితో సంబంధం ఉన్న కొందరు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement