'హైదరాబాద్ ఆదాయం అంతా తెలంగాణకే'
హైదరాబాద్: ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర విభజన చేశారన్న ఆరోపణలను కేంద్ర మంత్రి జైరాం రమేష్ తోసిపుచ్చారు. రాజ్యాంగబద్దంగానే విభజన చేశామని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో తొందపాటుగా వ్యహరించలేదన్నారు. పదేళ్ల పాటు సంప్రదింపులు, చర్చలు జరిపిన తర్వాతే విభజన చేశామన్నారు.
హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు. శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, ఆస్తుల పరిరక్షణ అధికారాలు గవర్నర్ చేతిలో ఉంటాయని వెల్లడించారు. హైదరాబాద్ ఆదాయం అంతా తెలంగాణకే వెళుతోందని, ఒక్కరూపాయి కూడా సీమాంధ్రకు వెళడం లేదని వెల్లడించారు. అందుకోసమే సీమాంధ్రకు ప్రధాని 6 పాయింట్ల ప్యాకేజీ ప్రకటించారని తెలిపారు. సీమాంధ్ర ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని జైరాం రమేష్ పునరుద్ఘాటించారు.