తెలంగాణ ఇచ్చిన తర్వాత టీఆర్‌ఎస్‌ను విలీనం చేయకుంటే కాంగ్రెస్‌లో చేరుతానని టీఆర్‌ఎస్‌కు చెందిన మంచిర్యాల శాసనసభ్యుడు గడ్డం అరవింద్‌రెడ్డి స్పష్టం చేశారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇచ్చిన తర్వాత టీఆర్‌ఎస్‌ను విలీనం చేయకుంటే కాంగ్రెస్‌లో చేరుతానని టీఆర్‌ఎస్‌కు చెందిన మంచిర్యాల శాసనసభ్యుడు గడ్డం అరవింద్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్‌సింగ్‌తో పాటు మరికొంతమంది అధిష్టాన పెద్దలకు చెప్పినట్లు తెలిపారు. అసెంబ్లీ లాబీల్లో ఆయన మాట్లాడుతూ ‘‘తెలంగాణ రాష్ట్రంకోసం పుట్టినందుకే టీఆర్‌ఎస్‌లో చేరిన. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని కేసీఆర్ చాలాసార్లు అన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత టీఆర్‌ఎస్ అవసరం ఏమిటి? తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞత ఉండొద్దా? కొందరిని ఎమ్మెల్యేలు, ఎంపీలుగా చేయడానికే టీఆర్‌ఎస్ పుట్టిందా?’’ అని ప్రశ్నించారు.