gaddam aravind reddy
-
‘ప్రాణహిత’ సాధించే వరకు పోరాటం
మంచిర్యాలటౌన్: వార్దానది ప్రాజెక్టును ఆపే వరకు పోరాడి, ప్రాణహిత ప్రాజెక్టును సాధించే వరకు పోరాటం తప్పదని అఖిలపక్షం నేతలు అన్నారు. పట్టణంలోని ఎఫ్సీఏ ఫంక్షన్‌హాలులో గురువారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నీటికి కొదువ లేదని, కానీ ఒక్క ఎకరానికి కూడా సాగునీటిని అందించే ప్రాజెక్టులు లేవన్నారు. మన జిల్లాలో పారుతున్న నదుల నీటిని ఇతర జిల్లాలకు తరలిస్తున్నారని, అక్కడ రెండు నుంచి మూడు పంటలకు సాగునీరు అందుతుందని, మన వద్ద కనీసం ఒక్క పంటకు కూడా సరిపడా నీటిని అందించని దౌర్భాగ్యపు పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే సాగునీటి ప్రాజెక్టులను ఒక ప్రణాళిక ప్రకారం డిజైన్ చేసి, వాటి నిర్మాణం కోసం కృషి చేస్తే, కేసీఆర్ ఆ ప్రాజెక్టుల డిజైన్లు మార్చి, దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీటిని అందించే వరకు తమ పోరాటం తప్పదన్నారు. అనంతరం ఇతర నేతలు మాట్లాడుతూ ప్రాణహిత ప్రాజెక్టును వార్ధానదిపైకి మార్చి కేసీఆర్ తమ ముంబాయి 148 మీటర్ల ఒప్పందాన్ని తనే తుంగలో తొక్కారని, కమీషన్ల కోసం కాళేశ్వరానికి మార్చి ప్రాణహిత ప్రాణం తీశారని అన్నారు. కేసీఆర్ నిర్ణయంపై మరో తెలంగాణ ఉద్యమం మాదిరి, నీటి కోసం ఉద్యమాన్ని చేపడతామని, గతంలో ప్రాణహిత ప్రాజెక్టు కోసం 70 శాతం పైప్‌లైన్ పనులను పూర్తి చేసిందని, కేవలం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తే సరిపోయేదని అన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు మార్పుతో కనీసం వెయ్యి ఎకరాలకు కూడా నీరు పారేందుకు అవకాశం లేదని, ప్రజల్లోకి ఇదే విషయాన్ని తీసుకెళ్లి, ప్రభుత్వంతో పోరాటం చేసేందుకు అన్ని పార్టీల నేతలు సిద్ధంగా ఉండాలని కోరారు. తెలంగాణకు ఎనలేని మేలుచేసే ప్రాణహితను 148 మీటర్ల మైలారం నుంచి 138 మీటర్ల గోదావరి(సుందిళ్ల 132 మీ)లకు అనుసంధానం చేస్తే సంపూర్ణ గ్రావిటీ కాలువకు, కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న వార్దా్టకు బదులు ప్రాణహిత ప్రాజెక్టును మార్చే నిర్ణయం గొడ్డలిపెట్టులాంటిది అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేని శంకర్, సీపీఐ(ఎంఎల్), కాంగ్రెస్ పార్టీకి చెందిన దుర్గం అశోక్, చిట్ల సత్యనారాయణ, గరిగంటి కొమురయ్య, టీడీపీ పట్టణ అధ్యక్షుడు గోపతి మల్లేశ్, ఐఆర్‌సీపీ నాయకులు నైనాల వెంకటేశ్వర్లు, జయరావు, జలసాధన సమితి అధ్యక్షుడు నైనాల గోవర్దన్, రాజేశ్ నాయక్, రఘునాథరెడ్డి, తెలంగాణ జనసమితి నాయకులు శ్యాంసుందర్‌రెడ్డి, క్యాతం రవికుమార్, దుర్గం నరేశ్, బదావత్ రమేశ్ నాయక్, వొడ్నాల శ్యాం, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్లోకి అరవిందరెడ్డి..?
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : సార్వత్రిక ఎన్నికల ముందు టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి తిరిగి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. కొద్ది రోజుల్లోనే ఆయన చేరిక ఉంటుందనే చ ర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఆయన టీఆర్ఎస్ జిల్లా నాయకుడితో మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. పలుమార్లు పార్టీ అధినేత కేసీఆర్‌పై తిరుగుబావుటా ఎగురవేసిన అరవింద్‌రెడ్డిని తిరిగి పార్టీలో చే ర్చుకునే అంశంపై ముఖ్య నాయకత్వం తర్జనభర్జన పడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అరవింద్‌రెడ్డి 2001 నుంచి టీఆర్ఎస్లో కొనసాగుతున్నా రు. అప్పట్లో అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తులో భాగంగా ఆయనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దక్కలేదు. 2009 జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో రెండోసారీ విజయం సాధించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్‌లో చేరారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఆయన మంచిర్యాల స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. పలుమార్లు అధినేత కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన అరవింద్‌రెడ్డి చాలాసార్లు వార్తల్లోకి ఎక్కారు. ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు టీఆర్ఎస్లో చేరారు. ఈ నేపథ్యంలో అరవింద్‌రెడ్డి కూడా కారెక్కే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంచిర్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ అత్యధిక కౌన్సిలర్ స్థానాలు గెలుచుకుంది. కానీ.. ఈ బల్దియా చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్య నాయకులు పావులు కదుపుతుంటే.. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న అరవింద్‌రెడ్డి పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఎన్నిక విషయంలో చొరవ చూపాల్సిన అరవింద్‌రెడ్డి పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నట్లు చర్చకు దారితీస్తోంది. -
కవిత రాకతో కార్మికులకు న్యాయం
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్)కు గౌరవాధ్యక్షురాలిగా నిజామాబాద్ ఎంపీ కవితను నియమించడంతో కార్మికులకు మేలు జరుగుతుందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన తన నివాస గృహంలో విలేకరులతో మాట్లాడారు. సింగరేణి కార్మికులు టీబీజీకేఎస్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, కవిత నియామకంతో కార్మికుల సుధీర్ఘకాలమైన డిపెండెంట్ ఉద్యోగాలు, ఇతర కీలక సమస్యలు కొలిక్కి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పదమూడేళ్లుగా కేసీఆర్ తెలంగాణ కోసం ఉద్యమం చేయగా యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ తెలంగాణను ప్రకటించి ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని మంచిర్యాల జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం ధూంధాం నిర ్వహించనున్నట్లు చెప్పారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కమలాకర్‌రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వంగల దయానంద్, కౌన్సిలర్లు జగన్మోహన్రావు, షఫీ, శ్రీపతి శ్రీనివాస్, నాయకులు బోరిగాం రాజారాం, కొత్త జయప్రకాశ్ పాల్గొన్నారు. -
విలీనం చేయకుంటే కాంగ్రెస్‌లో చేరతా: ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇచ్చిన తర్వాత టీఆర్ఎస్ను విలీనం చేయకుంటే కాంగ్రెస్‌లో చేరుతానని టీఆర్ఎస్కు చెందిన మంచిర్యాల శాసనసభ్యుడు గడ్డం అరవింద్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జీ దిగ్విజయ్‌సింగ్‌తో పాటు మరికొంతమంది అధిష్టాన పెద్దలకు చెప్పినట్లు తెలిపారు. అసెంబ్లీ లాబీల్లో ఆయన మాట్లాడుతూ ‘‘తెలంగాణ రాష్ట్రంకోసం పుట్టినందుకే టీఆర్ఎస్లో చేరిన. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని కేసీఆర్ చాలాసార్లు అన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత టీఆర్ఎస్ అవసరం ఏమిటి? తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞత ఉండొద్దా? కొందరిని ఎమ్మెల్యేలు, ఎంపీలుగా చేయడానికే టీఆర్ఎస్ పుట్టిందా?’’ అని ప్రశ్నించారు.