'నా వ్యక్తిగత విషయాలపై స్పందించను' | Iam not able to Respond to Personals, says digvijaya singh | Sakshi
Sakshi News home page

'నా వ్యక్తిగత విషయాలపై స్పందించను'

Published Fri, May 2 2014 1:15 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

'నా వ్యక్తిగత విషయాలపై స్పందించను' - Sakshi

'నా వ్యక్తిగత విషయాలపై స్పందించను'

విజయవాడ : తన వ్యక్తిగత విషయాలపై స్పందించనని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. విజయవాడ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పురందేశ్వరిని గౌరవించి పదవులు ఇచ్చిందన్నారు. అదే బీజేపీ ఆమెకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. దివంగత ప్రధానమంత్రి పీవీ నరసింహరావుకు తామేమీ అన్యాయం చేయలేదని దిగ్విజయ్ తెలిపారు. ఆయన అంత్యక్రియలకు స్థలం కేటాయిస్తామన్నా....కుటుంబ సభ్యులే పార్ధీవ దేహాన్ని తీసుకెళ్లారన్నారు.

ఆర్ఎస్ఎస్ పరివాహ శక్తులు లౌకిక వాదానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని దిగ్విజయ్ అన్నారు. నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ భావాలు గల వ్యక్తి అని ఆయన వ్యాఖ్యలు చేశారు. మోడీకి లౌకిక వాదం అనే పదానికి అర్ధం కూడా తెలియదని ఎద్దేవా చేశారు. కాగా దిగ్విజయ్ సింగ్, రాజ్యసభ టీవీ వ్యాఖ్యాత అమృతా రాయ్ల మధ్య  ప్రేమాయణంతో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement