సాక్షిప్రతినిధి, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేది, తెచ్చేది తామేనని గతంలో ప్రకటించినట్లుగానే మాట నిలబెట్టుకున్నామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి పార్లమెంట్‌లో బిల్లు ప్రక్రియ కూడా త్వరలోనే పూర్తవుతుందని చెప్పారు. రాష్ట్రంగా ఏర్పాడ్డాక తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఆయన మంగళవారం కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారులు, విద్యార్థులపై కేసులను ఎత్తివేస్తామన్నారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు బంగారు భవిష్యత్తు ఉంటుందని, మెరుగైన రాష్ట్రం కోసం అందరమూ కృషి చేయాలని కోరారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మన్మోహన్‌సింగ్, దిగ్విజయ్‌సింగ్‌లకు కరీం నగర్ ప్రజల తరుపున కృతజ్ఞతలు చెప్పారు.
కాంగ్రెస్‌పై నమ్మకంతో తమను ముందుకు నడిపిన అందరికీ ధన్యావాదాలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ సాధనలో ముందుండి నడిచిన ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజాసంఘాలు, కుల సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎ.లక్ష్మణ్‌కుమార్, డీసీసీబీ చైర్మన్ కె.రవీందర్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.సురేందర్‌రెడ్డి, వేములవాడ ఆలయ కమిటీ చైర్మన్ బొమ్మ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ
Published Wed, Aug 7 2013 5:10 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM
Advertisement