అనర్హత వేటు పడితే మళ్లీ పోటీ చేస్తా: గీత | if disqualify i will contest again, says Kothapalli Geetha | Sakshi
Sakshi News home page

అనర్హత వేటు పడితే మళ్లీ పోటీ చేస్తా: గీత

Published Tue, Aug 26 2014 1:16 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

అనర్హత వేటు పడితే మళ్లీ పోటీ చేస్తా: గీత - Sakshi

అనర్హత వేటు పడితే మళ్లీ పోటీ చేస్తా: గీత

న్యూఢిల్లీ : తనపై అనర్హత వేటు పడితే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని అరకు ఎంపీ కొత్తపల్లి గీత తెలిపారు. ఇటీవలి జరిగిన ఎన్నికల్లో ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. అనంతరం కొత్తపల్లి గీత...టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును కలిసిన విషయం తెలిసిందే.

 

మంగళవారమిక్కడ కొత్తపల్లి గీత మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని, టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలతో కలిసి పని చేస్తానని తెలిపారు. అయితే తాను ఇప్పుడు తాను ఏ పార్టీలోనూ చేరటం లేదని ఆమె స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఈ మధ్య కాలంలో ఎప్పుడూ కలవలేదని, ఎలాంటి ఫిర్యాదు చేయలేదని కొత్తపల్లి గీతా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement