రెంటచింతల: ‘పరిశ్రమలు వస్తే అభివృద్ధి జరుగుతుందని చెబితే నమ్మాం.. పిల్లలకు ఉపాధి దొరుకుతుందని ఆశలు కల్పిస్తే మా భూములన్నీ తక్కువ ధరకే ఇచ్చేశాం. నాటి హామీలన్నీ ఇప్పుడు నీటి మూటలుగానే మిగిలిపోయాయి..’ ఇది రెంటచింతల మండలంలో పరాశక్తి సిమెంట్స్ కోసం భూములు విక్రరుుంచిన రైతులు ఆవేదన. ఈ మేరకు బాధితులు ఆదివారం మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వద్ద తమ గోడు వెల్లడించారు.
ఫ్యాక్టరీ కోసం గోలి, జెట్టిపాలెం, మల్లవరం గ్రామాల పరిధిలోని భూమిని 1998 నుంచి 2000 వరకూ సేకరించి, 2002లో నిర్మాణం చేపట్టిందనీ, నాడు ఇచ్చిన హామీ ప్రకారం తమ పిల్లలకు ఉద్యోగాలు కల్పించలేదనీ, గ్రామాలు దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామన్న హమీలు మరిచారనీ వారు ఏకరువు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఒక్క సీసీ రోడ్డుకూడా వెయ్యలే దని చెప్పారు. ప్రభుత్వ పోరంబోకు డొంక భూములు నాలుగెకరాలు కూడా ప్యాక్టరీ ఆధీనంలో ఉన్నాయనీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన 760/1, 760/2, 760/3, 761/1, 761/2, 762/1, 762/2, 764/1, 764/2, 765/1, 765/2, 766/1, 766/2, 766/3, 767, 773/1. 773/2 సర్వే నంబర్లలోనున్న అసైన్డ్‌భూములు ఎకరాకు నాడు రూ.20 వేల నుంచి రూ.40వేల వరకు మాత్రమే చెల్లించారనీ, 85 ఎకరాలలో ప్యాక్టరీ నిర్మాణం, 59 ఎకరాలలో ఉద్యోగుల కాలనీ, 45 ఎకరాలలో గ్రీన్ పార్కు నిర్మాణం చేపట్టిన యాజమాన్యం జెట్టిపాలెం, గోలి, పశర్లపాడుకు చెందిన 25 మందికి మాత్రమే ఉపాధి కల్పించిందని పేర్కొన్నారు. ప్యాక్టరీ ఆధీనంలో మైనింగ్-1 కింద 448 ఎకరాలు, మైనింగ్ -2 కింద మరో 400 ఎకరాలు భూములున్నాయనీ, భూములిచ్చిన ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు అనేక మార్లు అధికారుల చుట్టూ తిరిగి న్యాయం చేయాలని అర్థించినా పట్టించుకోలేదనీ వారు ఎమ్మెల్యే వద్ద మొరపెట్టుకున్నారు.
అన్యాయం చేస్తే సహించం..
దీనికి స్పందించిన ఎమ్మెల్యే పీఆర్కే మాట్లాడుతూ దళిత, గిరిజన, బడుగు వర్గాలకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. చట్ట ప్రకారం ప్రభుత్వం అసైన్డ్ భూములను దళిత, గిరిజనులకు కేటాయిస్తే వాటిని కొనుగోలు చేయకూడదన్నారు. దీనిని ఉల్లంఘించి పరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం 350 ఎకరాలు తీసుకుని ఉపాధి కల్పించకపోవడం, గ్రామాల అభివృద్ధి మరచిపోవడం దారుణమన్నారు. ఈ సమస్యను జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తానన్నారు.
నాటి మాటలు నీటిమూటలు
Published Mon, Dec 29 2014 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 6:53 PM
Advertisement