ఈ ఏడాదిలోనే మా అబ్బారుుతో కలిసి నటిస్తా
ఈ ఏడాదిలోనే మా అబ్బారుుతో కలిసి నటిసా
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు బుధవారం సినీనటుడు సారుుకుమార్ పట్టుచీర సమర్పించారు. మార్చి 7న తాను కొత్త ఇంట్లో గృహప్రవేశం చేస్తున్న సందర్భంగా ఈ చీరను సమర్పించానని, ఆ రోజున అమ్మవారికి అలంకరించాలని ఆలయ అధికారులను ఆయన కోరారు. బుధవారం కుటుంబసమేతంగా అమ్మ దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ పర్యవేక్షకుడు బలరామ్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పట్టుచీర దుర్గమ్మకు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ..
న్యూస్‌లైన్ : అమ్మవారిని కుటుంబ సమేతంగా
దర్శించుకోవడంలో విశేషం?
సాయికుమార్ : ఏలూరు సమీపంలోని గాళాయిగూడెంలోని గ్రామ దేవతను దర్శించుకుని ఇక్కడకు వచ్చాను. నన్ను హీరోగా నిలిపిన గాజుల నాగేశ్వరరావు స్వగ్రామం గాళాయిగూడెం. నేను ఈస్థాయికి రావడానికి కారణమైన గ్రామాన్ని, గ్రామ దేవతను సందర్శించుకోవడం ఆనందంగా ఉంది. దుర్గమ్మ దర్శనం అదృష్టంగా భావిస్తున్నా.
న్యూస్‌లైన్ : త్వరలో విడుదల కాబోయే మీ సినిమాలు..
సాయికుమార్ : ఆటోనగర్ సూర్య, చిలుకూరు బాలాజీ సినిమాలు త్వరలో విడుదల కాబోతున్నారుు. వాటిల్లో మంచి పాత్రలు పోషించాను.
న్యూస్‌లైన్ : మీ అబ్బాయి ఆదితో కలిసి సినిమా చేస్తారా..?
సాయికుమార్ : ఈ ఏడాది తప్పకుండా మా అబ్బాయితో కలిసి నటిస్తా. దీనికి అవసరమైన కథలు సిద్ధంగానే ఉన్నారుు. సెట్స్‌పైకి వెళ్లడమే ఆలస్యం..
న్యూస్‌లైన్ : కొత్త ఇంటి గురించి విశేషాలు చెప్పండి?
సాయికుమార్ : కొత్తగా ఇంటిని కట్టుకున్నాం. వచ్చేనెల ఏడోతేదీ రాత్రి గృహ ప్రవేశం. విజయవాడ వచ్చిన ప్రతిసారీ అమ్మవారిని దర్శించుకోవడం నా అదృష్టం. అందులో ఈ దఫా ప్రత్యేకత ఉంది కదా. అందుకే అమ్మవారికి మా కుటుంబ తరఫున పట్టుచీరను సమర్పించడమే కాకుండా ఆ చీరను వచ్చేనెల ఏడో తేదీన అలంకరించాలని కోరాం. వాస్తవంగా అమ్మవారికి చీరను ఈనెలలోనే అలంకరించాలని అడిగాం. ఖాళీ లేకపోవడంతో వచ్చే నెల ఏడో తేదీకి టైమ్ ఇచ్చారు. అదేరోజు మా గృహప్రవేశం కావడం యూదృచ్ఛికం కావడంతో మా శ్రీమతి ఆనందానికి అవధులు లేకుండా పోయూరుు.
న్యూస్‌లైన్ : త్వరలో మీరు నటించే చిత్రాలు?
సాయికుమార్ : రఫ్, గలాటాతో పాటు మరో రెండు చిత్రాలు ఉన్నాయి. తాజాగా నటించిన ‘ఎవడు’ మంచి హిట్ కావడం ఆనందంగా ఉంది. ‘ఆటోనగర్ సూర్య’ అదే తరహాలో మంచి పేరును తీసుకువస్తుందని భావిస్తున్నా. సినిమా విజయవంతం కావాలని అమ్మవారిని కోరుకునా