సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యం లో ఆదివారం నుంచి ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ మండల
నేటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష
Published Sun, Sep 29 2013 2:28 AM | Last Updated on Fri, May 25 2018 9:39 PM
బలిజిపేట రూరల్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యం లో ఆదివారం నుంచి ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ మండల కన్వీనర్ ఎం. శ్రీరామ్మూర్తి తెలిపారు. బలిజిపేటలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వైఎస్సార్‌సీపీ సమైక్యాంధ్రకు మద్దతిస్తున్నందున ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు దీక్ష చేపట్టడానికి నిర్ణయించామన్నారు.
దీక్షలో తనతో పాటు పాలూరు నారాయణరావు (బర్లి), గంటా గౌరీశంకరరావు (గంగాడ) కూర్చుంటారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బి.కాశినాయుడు, ఎస్.సత్యంనాయుడు, పి.సత్యనారాయణరాజు, పి.మురళీకృష్ణ, విజయందొర, పి.నారాయణరావు, జి.చిరంజీవిమాష్టారు, పి.వెంకటినాయుడు, శాంతారాం, డి.భాస్కరరావు, లక్ష్ముంనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement