విశాఖ, తిరుపతిలో ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్స్ | Integrated Bus Terminals in Visakhapatnam, Tirupati | Sakshi
Sakshi News home page

విశాఖ, తిరుపతిలో ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్స్

Published Mon, Jun 20 2016 2:11 AM | Last Updated on Mon, Sep 4 2017 2:53 AM

విశాఖ, తిరుపతిలో ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్స్

విశాఖ, తిరుపతిలో ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్స్

ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు వెల్లడి
 
 తగరపువలస/ద్వారకానగర్ (విశాఖపట్నం): విశాఖ, తిరుపతి పట్టణాలలో ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేయనున్నట్టు ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు వెల్లడించారు.  విశాఖ జిల్లా తగరపువలసలో 4.09 ఎకరాల్లో రూ.7 కోట్లతో చేపట్టనున్న ఆర్టీసీ డిపో నిర్మాణానికి ఆదివారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా  ఆయన విలేకరులతో మాట్లాడారు.  బస్ టెర్మినల్స్ నిర్మాణానికి 15 రోజుల్లో టెండర్ల ప్రక్రియ  పూర్తిచే స్తామన్నారు.

 ఇకపై ఏటీఎం కార్డులతో టికెట్లు: రాష్ట్రంలోని ప్రధాన బస్ స్టేషన్లలో నగదుతో పాటు డెబిట్, క్రెడిట్, ఏటీఎం కార్డుల ద్వారా టికెట్లు తీసుకునేలా టికెట్ ఇష్యూయింగ్ మెషీన్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ సాంబశివరావు తెలిపారు. ఈ టిక్కెట్టు తీసుకున్నాక ఆరు గంటల వరకు ఉపయోగించుకునేందుకు అనుమతిస్తామన్నారు. ఆదివారం సాయంత్రం విశాఖలో ఆర్టీసీ కాంప్లెక్స్ మొబైల్ యాప్‌ను విడుదల చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement