జగ్గంపేట (తూర్పు గోదావరి) : స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన బాలుడు గల్లంతయ్యాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న సలాడి వీరబాబు(16) ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు.
ఈ క్రమంలో స్నేహితులతో కలిసి శుక్రవారం పుష్కర కాలువలో ఈత కొట్టడానికి వెళ్లి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు బాలుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.