ఎంబీబీఎస్‌ విద్యార్థిని అదృశ్యం.. ఆత్మకూరులో ప్రత్యక్షం | mbbs student missing.. found in atmakur | Sakshi
Sakshi News home page

ఎంబీబీఎస్‌ విద్యార్థిని అదృశ్యం.. ఆత్మకూరులో ప్రత్యక్షం

Published Sun, Feb 19 2017 11:41 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

mbbs student missing.. found in atmakur

తిరుపతి క్రైం: శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాల విద్యార్థిని  శనివారం ఉదయం తిరుపతిలో అదృమైంది. కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఆచూకీ లభించింది. అలిపిరి ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు విజయవాడకు చెందిన వరకుమార్‌ కుమార్తె వినిత (21)పద్మావతీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతోంది. అయితే ఈమె శనివారం ఉదయం 10 గంటల నుంచి అదృశ్యమైంది.  వారి బంధువులను విచారించినా  సాయంత్రం వరకు విద్యార్థిని ఆచూకీ లభ్యం కాలేదు. విద్యార్థిని ఫోన్‌ రింగ్‌ అవుతున్నా కూడా ఎత్తడం లేదు. దీంతో తోటి విద్యార్థులు ఏమైందో అని ఆందోళన చెందారు. కళాశాల ప్రిన్సిపల్‌ హనుమంతరావు అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు అలిపిరి పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టగా  ఆమె ఆచూకీ లభించిందనీ, కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఉన్నట్టు తెలిపారు. సోమవారం వినితను తిరుపతి తీసుకొస్తామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement