
గల్లీ, ఢిల్లీనే కాదు..అంతర్జాతీయ నేతలు కూడా..
- రాజధాని శంకుస్థాపనకు అన్ని స్థాయిల నేతలను ఆహ్వానిస్తామన్న సీఎం చంద్రబాబు
విజయవాడ: ప్రజల కోరిక మేరకు రాజమండ్రిని, రాజమహేంద్రవరంగా మార్చామని శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పేరు మార్పుపై నోటిఫికేషన్ను కేంద్రానికి పంపుతామన్నారు. రాజధాని శంకు స్థాపన కార్యక్రమానికి జాతీయ, అంతర్జాతీయ నాయకులను ఆహ్వానిస్తామని చెప్పారు. గ్రామస్థాయి నేత నుంచి ప్రతిపక్షనేత వరకూ అందరిని ఆహ్వానిస్తామన్నారు.
పోలవరం అంశాన్ని కేబినేట్ లో సుధీర్ఘంగా చర్చించామని తెలిపారు. పోలవరం పూర్తయితే ఏడు లక్షల ఎకరాలకు నీరందించే అవకాశం ఉందిని చెప్పారు. ముంపుమండలాలను ఆంధ్రపదేశ్ లో కలపడంతో అతిపెద్ద అడ్డంకి తొలగిపోయిందన్నారు. కృష్ణపట్నం పోర్టు రైల్వే లైన్ కోసం తొమ్మిది ఎకరాలు కేటాయించామన్నారు.