బంతి బంతికీ బెట్టింగ్! | IPL cricket betting | Sakshi
Sakshi News home page

బంతి బంతికీ బెట్టింగ్!

Published Mon, May 25 2015 4:09 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

IPL cricket betting

ఐపీఎల్ తుది పోరుపై పందేల జోరు
చేతులు మారిన కోట్ల రూపాయలు
కర్నూలు నగరంలో బెట్టింగ్‌రాయుళ్లు
హోటళ్లు, లాడ్జిల్లో కొనసాగిన దందా
మేము సైతం అన్న గ్రామీణులు

 
 సాక్షి, కర్నూలు : చెన్నై సూపర్‌కింగ్స్ గెలుస్తుంది.. నా పాట లక్ష ముంబై ఇండియన్స్ ఓడితే నేను రెండు రెట్లు అధికంగా ఇస్తాను బౌలర్ నెహ్రా 3 నుంచి 5 వికెట్లు తీస్తాడు.. లక్ష రూపాయల బెట్.. ..ఇవీ ఆదివారం జరిగిన ఐపీఎల్ టీ20 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్‌రాయుళ్లు ఇచ్చిన ఆఫర్లు. కర్నూలు నగరంలోని లాడ్జిలు, హోటళ్లలో ఈ దందా యథేచ్ఛగా సాగింది. జిల్లా పోలీసులు దీనిపై దృష్టి సారించక పోవడం బెట్టింగ్ రాయుళ్లకు వరంగా మారింది. కర్నూలు నగరంలో కనీసం రూ. 5 కోట్ల వరకు బెట్టింగ్ సాగినట్లు ఒక అంచనా.

ఇక్కడి వారికి ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లోని ప్రధాన బుకీలతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. గతంలో పందేలు కాస్తూ పలువురు పోలీసులకు పట్టుబడ్డారు. ముంబై-చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బంతికీ బెట్టింగులు నడవడం గమనార్హం. కొందరు అనుమానం రాకుండా నివాస గృహాల్లోనే ఈ వ్యవహారం నడిపినట్లు తెలుస్తోంది.  కర్నూలు నగరంతోపాటు జిల్లాలోని నంద్యాల, కోవెలకుంట్ల, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, డోన్, ఆత్మకూరు, పత్తికొండ తదితర పట్టణాలకూ ఈ బెట్టింగ్ దందా పాకింది.

జిల్లాలో జరిగే వ్యవస్థీకృత బెట్టింగ్‌కు కర్నూలు నగరం ప్రధాన కేంద్రంగా ఉండడం గమనార్హం. చిరువ్యాపారుల నుంచి బడాబాబుల దాకా ఈ వ్యవహారం డబ్బులు పోగొట్టుకొని చేతులు కాల్చుకున్న వారే. పందేల కోసం కొందరు యువకులు ఏకంగా నేరాలకు సైతం పాల్పడుతున్నారు. చెన్నై-ముంబై జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌పై గ్రామీణ ప్రాంతాల్లో సైతం జోరుగా పందేలు సాగాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement