ముంబై మ్యాచ్‌కు 18వేల మంది చిన్నారులు | 18,000 underprivileged children to cheer for Mumbai Indians | Sakshi
Sakshi News home page

ముంబై మ్యాచ్‌కు 18వేల మంది చిన్నారులు

Published Sat, May 3 2014 1:26 AM | Last Updated on Wed, Sep 26 2018 3:36 PM

18,000 underprivileged children to cheer for Mumbai Indians

ముంబై: ఐపీఎల్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఇప్పటిదాకా ఖాతా తెరవకపోయినా సామాజిక కార్యక్రమాల్లో మాత్రం దూసుకుపోతోంది. ‘అందరికీ విద్య’ పేరుతో గత ఐదేళ్లుగా పేద పిల్లలు చదువుకునేలా ప్రోత్సహిస్తోంది.
 
 ఈ నేపథ్యంలో పిల్లల్ని ఉత్సాహపరిచేందుకు ముంబై-పంజాబ్ మధ్య జరిగే మ్యాచ్‌కు వారిని ఆహ్వానించింది. శనివారం వాంఖడే స్టేడియంలో జరిగే ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌ను 18 వేల మంది పేద విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ చొరవ తీసుకుని తొమ్మిది మంది పేద విద్యార్థులను దుబాయ్‌కి పంపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement