శ్రీవారి సేవలో ఇస్రో చైర్మన్
ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్ సోమవారం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. జీఎస్‌ఎల్‌వీ-డీ 5 రాకెట్ ప్రయోగం విజయవంతం అయిన నేపథ్యంలో ఆయన తన సతీమణితో కలిసి తిరుమలకు వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనం చేయగా, జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు లడ్డూ ప్రసాదాలు అందజేశారు.
- సాక్షి, తిరుమల