ఇస్రో జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు
ప్రయోగం 1
2001, ఏప్రిల్ 18: జీఎస్‌ఎల్‌వీ-డీ1
పంపిన ఉపగ్రహం: జీశాట్-1 (1,540 కిలోలు)
ఫలితం: విఫలం
కారణం: నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి ముందే రాకెట్‌లో ఇంధనం అయిపోయింది.
(ప్రయోగం విజయవంతమైనా.. జీశాట్-1 విఫలమైనట్లు ఇస్రో ప్రకటించింది)
ప్రయోగం 2
2003, మే 8; జీఎస్‌ఎల్‌వీ-డీ2
ఉపగ్రహం: జీశాట్-2 (1,825 కిలోలు)
ఫలితం: విజయవంతం
ప్రయోగం 3
2004, సెప్టెంబరు 20; జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్01
ఉపగ్రహం: ఎడ్యుశాట్ (1,950 కిలోలు)
ఫలితం: విజయవంతం
ప్రయోగం 4
2006, జూలై 10; జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్02
ఉపగ్రహం: ఇన్‌శాట్-4సీ (2,168 కిలోలు)
ఫలితం: విఫలం
కారణం: రాకెట్ దారి మళ్లడంతో ప్రయోగించిన కొన్ని సెకన్లకే కూల్చేశారు
ప్రయోగం 5
2007 సెప్టెంబరు 2; జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్04, ఉపగ్రహం: ఇన్‌శాట్-4సీఆర్ (2,160 కిలోలు)
ఫలితం: పాక్షిక విఫలం
కారణం: గెడైన్స్ వ్యవస్థ లోపం వల్ల
నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహం చేరలేదు.
దశలవారీగా ఉపగ్రహాన్ని నియంత్రిస్తూ నిర్దేశిత క్షక్ష్యకు చేర్చారు.
ప్రయోగం 6
2010, ఏప్రిల్ 15; జీఎస్‌ఎల్‌వీ-డీ3
(స్వదేశీ క్రయోజెనిక్ ఇంజిన్‌తో తొలి ప్రయోగం), ఫలితం: విఫలం
పయోగం 7
2010, డిసెంబరు 25; జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్06
ఉపగ్రహం: జీశాట్-5పీ (2,130 కిలోలు)
ఫలితం: విఫలం
కారణం: ప్రయోగించిన వెంటనే ద్రవ ఇంధన బూస్టర్లు విఫలం కావడంతో బంగాళాఖాతంలో కూల్చేశారు.
ప్రయోగం 8
2014, జనవరి 5; జీఎస్‌ఎల్‌వీ-డీ5
(స్వదేశీ క్రయోజెనిక్ ఇంజిన్‌తో రెండో ప్రయోగం)
ఉపగ్రహం: జీశాట్-14(1980 కిలోలు)
ఫలితం: విజయవంతం
జీశాట్-14 విశిష్టతలు.. ఉపయోగాలివీ..
జీశాట్-14 బరువు 1982 కిలోలు. ఇందులో 1131 కిలోలు ఇంధనం కాగా, ఉపగ్రహం బరువు 851 కిలోలు. టెలివిజన్ ప్రసారాలు, టెలికాం రంగంలో విస్తృత సేవలు అందించనుంది. సమాచార ఉపగ్రహాల్లో జీశాట్-14... 23వ ఉపగ్రహం. ఇస్రో పంపిన 10 సమాచార ఉపగ్రహాలు కక్ష్యలో పనిచేస్తూ 225 ట్రాన్స్‌ఫాండర్లతో డీటీహెచ్ ప్రసారాలు, టెలికాం సేవలు అందిస్తున్నాయి. మూడు, నాలుగేళ్లలో 450 టాన్స్‌పాండర్లను అందుబాటులోకి తేవాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో 850 టీవీ చానళ్లు ఉంటే 650 చానళ్లను ప్రభుత్వం గుర్తించింది. 300 చానళ్లకు మాత్రమే వీశాట్ లింక్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఇస్రో 120 ట్రాన్స్‌పాండర్లను ఉపయోగించుకుంటోంది. జీశాట్-14 ద్వారా 12 మరో ట్రాన్స్‌పాండర్లను అందుబాటులోకి వచ్చాయి.
మొత్తం 3 దశలు
మొదటి దశ: 151 సెకన్లలో పూర్తయింది. 160 టన్నుల ద్రవ ఇంధనాన్ని, 138.5 టన్నుల ఘన ఇంధనాన్ని మండించారు.
రెండో దశ: 292.5 సెకన్లలో పూర్తయింది. 39.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని మండించారు.
మూడో దశ: ఇదే అత్యంత కీలక దశ. క్రయోజెనిక్ ఇంజన్‌ను వాడింది ఈ దశలోనే. ఇంజిన్‌లోని 12.5 టన్నుల ఇంధనాన్ని మండించి 1,015 సెకన్లలో ఈ దశను పూర్తి చేశారు.
కక్షలోకి ఎప్పుడు?: సరిగ్గా 1,028 సెకన్లకు జీశాట్-14 ఉపగ్రహాన్ని క క్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఉపగ్రహం దీర్ఘవృత్తాకార కక్షలో భూమికి దగ్గరగా (పెరిజీ) 180 కిలో మీటర్ల దూరంలో, భూమికి దూరంగా (అపోజీ) 35,975 కిలో మీటర్ల దూరంలో పరిభ్రమిస్తోంది.