తిరుమల కొండల్లో ఇది రెండో ఎన్‌కౌంటర్ | It is the second encounter Tirumala Rigveda | Sakshi
Sakshi News home page

తిరుమల కొండల్లో ఇది రెండో ఎన్‌కౌంటర్

Published Fri, May 30 2014 12:52 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

It is the second encounter Tirumala Rigveda

  •     తొలి ఎన్‌కౌంటర్ బ్రహ్మాజీ కొండ వద్ద
  •      వారం రోజుల్లో నాలుగుసార్లు పోలీసుకాల్పులు
  •      తొలిసారి వెలుగుచూసిన బాణం
  •  సాక్షి, చిత్తూరు: శేషాచల కొండల్లో గత ఆరు నెలల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో  బుధవారం రాత్రి జరిగింది రెండోది. చామల రేంజ్ బ్రహ్మాజీ కొండ వద్ద(భాకరాపేట అడవుల్లో) తొలి ఎన్‌కౌంటర్ లో తమిళ కూలీ హతమయ్యాడు. ప్రస్తుతం ఈ ఎన్‌కౌంటర్లో ఒకేసారి ముగ్గురు ఎర్రదొంగలు మృతిచెందారు. ఎన్నికల కారణంగా సాయుధబలగాలు మూడు నెలలు కూంబింగ్ ఆపేశాయి. మళ్లీ నెల రోజులుగా చిత్తూరు, తిరుపతి అర్బన్‌జిల్లాల పోలీసులు కూంబింగ్ విస్తృతం చేశారు.

    అటు చామల రేంజ్(భాకరాపేట, తలకోన) నుంచి ఇటు తిరుమల మీదుగా మామండూరు రేంజ్(మామండూరు) వరకు తిరుమల అడవుల్లో   పోలీసులు, అటవీశాఖ, టాస్క్‌ఫోర్స్ సాయుధ బలగాలు నాలుగు బృందాలుగా విడిపోయి జల్లెడపడుతున్నారుు. వారం రోజులుగా సాగుతున్న విస్తృత కూంబింగ్‌లో నాలుగుసార్లు స్మగ్లర్ల దాడులను ఎదుర్కొన్న పోలీసు, అటవీశాఖల దళాలు, టాస్క్‌ఫోర్స్ బృందాలు ఆత్మరక్షణార్థం కాల్పులకు దిగాల్సి వచ్చింది.  

    15 రోజుల కిత్రం భాకరాపేట అడవుల్లో తొలిసారి స్మగ్లర్లు రాళ్లదాడికి దిగటంతో టాస్క్‌ఫోర్స్ పోలీసు బలగాలు గాలిలోకి కాల్పులు జరిపాయి. తరువాత వారం రోజులకు శ్రీవారి మెట్టు వద్ద, పులిబోనుకు పై ప్రాంతాల్లోను, చంద్రగిరి మండలం మామండూరు వద్ద హైవేకు సమీపంలోని అటవీప్రాంతంలో స్మగ్లర్లపై పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు.
     
    వెలుగుచూసిన బాణం

    తిరుమల అడవుల్లో ఎర్రచందనం నరికేందుకు వచ్చిన కూలీల వద్ద తొలిసారి బాణం వెలుగుచూసింది. గతంలో కూడా పోలీసులపై బాణంతో దాడులు చేసినా, అప్పట్లో బాణం వెలుగుచూడలేదని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. బాణం వెలుగు చూడటంతో ఎర్రదొంగలు తమిళనాడులోని తిరువణ్ణామలై జమునామత్తూరు అటవీ ప్రాంతానికి చెందిన గిరిజనులై ఉండవచ్చునని అధికారులు అనుమానిస్తున్నారు. వీరు మాత్రమే ఇతరులపై దాడికి బాణాలు కూడా వాడతారని విశ్లేషిస్తున్నారు.
     
    భక్తుల ముసుగులోనే..
     
    ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం తిరుమల శ్రీవారి ఆలయం, శ్రీవారి పాదాలకు సమీపంలో ఉండటంతో ఎర్రకూలీలు భక్తుల ముసుగులోనే కొండకు చేరుకుని అక్కడి నుంచి ఎర్రచందనం చెట్లను నరికేందుకు వెళ్లి ఉంటారని అటవీ, పోలీసు శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. కొందరు కూలీలు అటవీ మార్గంలో ఆయుధాలతో పైకి చేరుకోగా, మిగిలినవారు బస్సుల్లో తిరుమలకు, అక్కడి నుంచి కాలినడకన శేషాచల కొండల్లోకి ప్రవేశించినట్లు సమాచారం.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement