ఐటీ పార్కుకు మోక్షం | IT Park Beatitude | Sakshi
Sakshi News home page

ఐటీ పార్కుకు మోక్షం

Published Wed, Feb 12 2014 3:38 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

కరీంనగర్ ఐటీ పార్కుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ నెల 16న ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. ఈ మేరకు జిల్లా ఇన్‌చార్జి, ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మంగళవారం హైదరాబాద్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

సాక్షిప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ ఐటీ పార్కుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ నెల 16న ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన  జరగనుంది. ఈ మేరకు జిల్లా ఇన్‌చార్జి, ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మంగళవారం హైదరాబాద్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
 
 అనంతరం ఈ విషయాన్ని ఆయన మీడియాకు వెల్లడించారు. పార్కు నిర్మాణానికి ఇప్పటికే కరీంనగర్ మండలం మొగ్ధుంపూర్ వద్ద పదెకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ నిర్మాణం పూర్తయితే ఐటీ కంపెనీలకు ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement