
2019లో జగన్ సీఎం కావడం తథ్యం
2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం ఖావడం తథ్యమని జెడ్పీ చైర్మన్ .....
జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి
డక్కిలి: 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం ఖావడం తథ్యమని జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అన్నారు. డక్కిలిలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సీఎం చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమం చేపట్టి అధికారం పోయి ఇంటికెళ్లారన్నారు. అదేవిధంగా 2019లో జరగనున్న ఎన్నికల్లో జన్మభూమి కమిటీలతోనే ఇంటికి పోవడం ఖాయమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరూ భయపడాల్చిన పని లేదన్నారు.
న్యాయం కోసం ఎంత దూరమైన పోరాటం సాగిస్తామన్నారు. తాను జెడ్పీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనప్పటి నుంచి జిల్లాల్లోని అన్ని మండలాల్లో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడా లేనివిధంగా వెంకటగిరి నియోజకవర్గంలో అరాచకపాలన సాగుతోం దన్నారు. అధికారపార్టీ ఇష్టానుసారంగా పని చేస్తోందన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారను.
అధికారపార్టీ చేతుల్లో పోలీసు వ్యవస్థ కీలు బొమ్మగా మారిందన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి చేసినా పోలీసులు పట్టించకోకపోవడంపై మండిపడ్డారు. అధికారపార్టీ ఏది చెబితే అధికారులు అది చేయడం దారుణమన్నారు. గతేడాది వరదలు వచ్చిన సమయంలో రాపూరు మండలం సిద్ధవరంలో ఓ వ్యక్తి మృతి చెందాడన్నారు. అతడి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరు చేసిందన్నారు. దీనికి సంబంధించిన చెక్కును కూడా పార్టీల పేరు పెట్టి ఇవ్వకుండా అడ్డుకున్నారన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.
సమస్య పరిష్కారం కాకపోతే లోకాయుక్త ద్వారా కోర్టును ఆశ్రయిస్తామని చెబితే వెంటనే చెక్కును పంపిణీ చేశారన్నారు. అధికారం ఉందని సైదాపురం మండలం పరిషత్ వైస్ ప్రెసిడెంట్ వసంతలక్ష్మిపై సర్పంచ్ సుబ్రహ్మణ్యం నాయుడు దాడిచేశారని, దానిపై ఫిర్యాదు ఇచ్చినా కూడా పోలీసులు పట్టించుకోలేదన్నారు.