
జగన్‌ను కలిసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే
ఒంగోలు: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మంగళవారం ఒంగోలులో కలిశారు. ప్రకాశం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ సమీక్ష కోసం ఒంగోలు వచ్చిన వైఎస్ జగన్‌ను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో కలిశారు.
నెల్లూరు జిల్లాతో పాటు, తన నియోజకవర్గంలోని పరిస్థితిపై జగన్‌తో కొంతసేపు మాట్లాడారు. అనంతరం జగన్‌ను వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాలపర్తి డేవిడ్‌రాజు, జంకె వెంకటరెడ్డి, పోతుల రామారావు, ఆదిమూలపు సురేష్, గొట్టిపాటి రవికుమార్ కూడా బాలినేని నివాసంలో కలిశారు. జగన్ వెంట బాలినేని, ఒంగోలు ఎంపీ వైవీ.సుబ్బారెడ్డి కూడా ఉన్నారు.