ఏలూరు : రాష్ట్రంలో కొత్తగా 5.23 లక్షల మందికి ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేసిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. హైదరాబాద్ నుంచి సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో జన్మభూమి-మా ఊరు కార్యక్రమం అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ కొత్తగా అందిన పింఛన్ దరఖాస్తుల్లో 5.23 లక్షల మందిని అర్హులుగా గుర్తించామన్నారు. కలె క్టర్ కె.భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో 23,367 మంది కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. నీరు- చెట్టు కార్యక్రమం కింద జిల్లాలో ప్రతి పంచాయతీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో జన్మభూమి సభలను కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
13 నియోజకవర్గాల్లో జన్మభూమి సభలు
ఏలూరు (టూటౌన్) : జిల్లాలో సోమవారం 13 నియోజకవర్గాల్లో ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమం నిర్వహించి 82.78 లక్షల రూపాయలను 9వేల 231 మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు సామాజిక పింఛన్లు పంపిణీ చేశామని కలెక్టర్ కాటమనేని భాస్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 52 గ్రామాలు, 6 పురపాలక సంఘాలు, 1 నగరపాలక సంస్థ పరిధిలలోని 17 వార్డులలో ఈ కార్యక్రమం నిర్వహించినట్టు చెప్పారు. 69 వైద్య శిబిరాలు నిర్వహించి 5 వేల 35 మందికి వైద్యసేవలు అందించామని, 494 హెల్త్‌కార్డులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. 51 పశు వైద్య శిబిరాలు నిర్వహించి, 4 వేల100 పశువులకు వైద్య సేవలు అందించామన్నారు. ప్రజల నుంచి 7 వేల 196 విజ్ఞప్తులను స్వీకరించామని కలెక్టర్ తెలిపారు. గ్రామ సభలలో ప్రజల నుంచి అందిన విజ్ఞప్తులను ఆన్‌లైన్‌లో పొందుపరిచి సంబంధిత అధికారులకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలిచ్చినట్టు కలెక్టర్ చెప్పారు.
‘జన్మభూమి’పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష
Published Tue, Oct 7 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM
Advertisement
Advertisement