నిరసన సెగలు
సాక్షి, ఏలూరు/పాలకొల్లు టౌన్: ‘జన్మభూమి-మా ఊరు’ పేరిట గ్రామ సభలు, పట్టణాల్లో వార్డు సభలు నిర్వహిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులకు అడుగడుగు నా నిరసనలు స్వాగతం పలుకుతున్నాయి. అన్ని అర్హతలూ ఉన్నా తమకు పింఛ న్లు ఎందుకు నిలిపివేశారంటూ వృద్ధులు, వితంతువులు గ్రామ సభలు, వార్డు సభల్లో నిలదీస్తున్నారు. రుణాలను ఎప్పు డు మాఫీ చేస్తారంటూ డ్వాక్రా మహిళలు, రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్న ప్రజాప్రతినిధులు అక్కడక్కడా సహనం కోల్పోతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రతి పక్ష నేతలపై చిందులు తొక్కుతున్నారు.
పింఛను ఎందుకు ఆపేశారు
పాలకొల్లు 2వ వార్డులో సోమవారం నిర్వహించిన వార్డు సభలో కె.పైడియ్య అనే వృద్ధుడు తనకిచ్చే పింఛన్‌ను అన్యాయంగా ఆపేశారని నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజును, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును నిలదీశాడు. తాను ఐదేళ్లుగా వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నాని.. కుటుంబ పోషణ కోసం గత్యంతరం లేక కాఫీ హొటల్‌లో పని చేసుకుంటున్న తనకు 5 ఎకరాల పొలం ఉందనే అసత్య సమాచారంతో పింఛను నిలిపివేశారని వాపోయూడు. ఆ సమయంలో టీడీపీ నాయకులు కొందరు అతడిని మాట్లాడకుండా నిలువరించే ప్రయత్నం చేశారు. అరుునప్పటికీ, ఆ వృద్ధుడు తన ఆవేదనను వెళ్లగక్కడంతో ఎమ్మెల్యే రామానాయుడు స్పందిం చారు. మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల చాలా వార్డుల్లో అర్హులైన వృద్ధులు, వితంతువుల పింఛన్లు నిలిచిపోయూయన్నారు. లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్ చేయకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందన్నారు. వచ్చే నెలలో రెండు నెలల పింఛన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వగా, నిరాశతో ఆ వృద్ధుడు వెనుదిరిగాడు. జిల్లాలో నిర్వహిస్తున్న ప్రతి గ్రామ, వార్డు సభల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నారుు.
మంత్రులకూ తప్పని పరాభవం
గ్రామ, వార్డు సభల్లో మంత్రులు, ఎంపీలకు సైతం పరాభవం తప్పడం లేదు. జన్మభూమి కార్యక్రమానికి వెళుతున్న మంత్రి పీతల సుజాత కాన్వాయ్‌ను నల్లజర్ల మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఐకేపీ యానిమేటర్లు సోమవారం అడ్డుకున్నారు. తమకు రావాల్సిన 15నెలల వేతనం ఇవ్వాల్సిందిగా కోరారు. సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళతానని మంత్రి సముదాయించారు. రాజ మండ్రి ఎంపీ మురళీమోహన్ కల్పించుకుని ఐకేపీ వేతనాలను విడుదల చేస్తామనే హామీని గత ప్రభుత్వం ఇచ్చిం దని, దానిని నెరవేర్చాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. తప్పదనుకుంటే తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలానికి వేతనాలు ఇస్తామంటూ చులకనగా మాట్లాడారని ఐకేపీ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ కె.భాస్కర్ ఐకేపీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చి శాంతింపజేశారు.
ప్రతిపక్షాలపై విసుర్లు
అధికారం కట్టబెడితే వ్యవసాయ, డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ పదవిలోకి వచ్చాక రుణమాఫీపై కమిటీలు, కార్పొరేషన్లు అంటూ కాలయాపన చేయడం తగదంటూ మహిళలు, రైతులు జన్మభూమి సభల్లో దుమ్మెత్తి పోస్తున్నారు. ఎప్పటిలోగా రుణమాఫీ చేస్తారో స్పష్టంగా చెప్పాలంటూ నేతలను నిలదీస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ప్రజలకు సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్న ప్రజాప్రతినిధులు ప్రతిపక్ష పార్టీలను దుమ్మెత్తిపోస్తూ.. ఆయూ పార్టీలకు చెందిన నాయకులను దూషిస్తూ ప్రజా నిరసనల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సోమవారం ఉండి గ్రామంలో ఇదే జరిగింది. రైతులు, డ్వాక్రా మహిళలు రుణమాఫీ సంగతేంటని అడిగేందుకు గ్రామ సభకు రాగా, వారి తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉపసర్పంచ్ ఏడిద వెంకటేశ్వరావు, ఆ పార్టీ నేత కొత్తపల్లి రమేష్‌రాజు రైతు, డ్వాక్రా మహిళల రుణమాఫీపై ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు (శివ)ను, అధికారులను ప్రశ్నించారు. కార్పొరేషన్ పేరుతో నాలుగేళ్ల వరకూ రుణమాఫీ చేయకపోతే రైతులు వడ్డీలు ఎలా కట్టుకోవాలని, బ్యాం కులు కొత్త రుణాలివ్వడం లేదని, వెంటనే రుణాలు మాఫీ చేయాలని కోరారు. జనం తరపున మాట్లాడటమే తప్పు అన్నట్టుగా ఎమ్మెల్యే శివ వారిపై విరుచుకుపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తమను ప్రశ్నించే అర్హత లేదన్నారు. ప్రధాన ప్రతిపక్షం అనే సంగతి కూడా మర్చిపోయారు. దీంతో ఇరువర్గాల మధ్యా మాటామాటా పెరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు కల్పించుకుని ఇరువర్గాలను శాంతింపచేశారు. ఇలాంటి ఘటనలు సైతం ప్రతిచోట జరుగుతూనే ఉన్నాయి.