రాయల తెలంగాణకే జేసీ ఓటు
హైదరాబాద్: ముఖ్యమంత్రి మార్పు ఉండబోదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. సీఎం మార్పు అనేది ఊహాగానామే అని ఆయన కొట్టిపారేశారు. సీఎం కిరణ్ అధిష్టాన విధేయుడని వెల్లడించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నప్పటికి విభజన పక్రియలో హైకమాండ్ డైరెక్షన్ ప్రకారమే ఆయన నడుచుకుంటారని అభిప్రాయపడ్డారు.
రాయల తెలంగాణ కావాలని మొదటినుంచి కోరుతున్నానని వెల్లడించారు. ఈ అంశంతో పాటు ఇతర రాజకీయ అంశాలను చర్చించేందుకే కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డితో హైకమాండ్ పెద్దలు సమావేశమౌవుతున్నారేమోనని అన్నారు. మహబూబ్నగర్ బస్సుప్రమాద ఘటనపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు.