వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై జేసీ వర్గీయుల దాడి | JC diwakar reddy supporters attacked YSR congress workers | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై జేసీ వర్గీయుల దాడి

Published Sat, Feb 22 2014 1:18 PM | Last Updated on Thu, Aug 16 2018 5:07 PM

JC diwakar reddy supporters attacked YSR congress workers

అనంతపురం : అనంతపురంలో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. యల్లనూరు మండలం వెన్నపూసపల్లెలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దౌర్జన్యానికి దిగారు.  ఈ సంఘటనలో ముగ్గురు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.  వారిని చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మొదటి నుంచి వెన్నపూసపల్లె కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న గ్రామం.  అయితే తాజాగా రాష్ట్ర విభజన, మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆ గ్రామ ప్రజలు  వైఎస్ఆర్ సీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో జేసీ వర్గీయులు దీన్ని తట్టుకోలేక ఆ గ్రామ ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.  వైఎస్ఆర్ సీపీ నేతను కలిసేందుకు వెళుతున్నకార్యకర్తలపై జేసీ వర్గీయులు ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేసి గాయపరిచారు.  ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement