జేసీ ప్రభాకర్ వివాదస్పద వ్యాఖ్యలు
అనంతపురం: తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి రైతులపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సబ్సిడీ వేరుశెనగ విత్తనాలు బహిరంగ మార్కెట్ లో అమ్ముకునేందుకే అన్నదాతలు ఆందోళన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దళారుల సహకారంతో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. వేరుశెనగ విత్తనాల ధరలు పెరిగినందునే సబ్సిడీ విత్తనాలకు డిమాండ్ పెరిగిందన్నారు.
పీసీసీ అధ్యక్ష పదవిపోయిన తర్వాత రఘువీరా రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడనున్నారని ప్రకటించి సంచలనం రేకిత్తించారు.