ఉమావి కక్ష సాధింపు రాజకీయాలు
ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ మండిపడ్డారు. మంగళవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ నాయకులు సామినేని ఉదయభాను, రోజాలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు.
నందిగామ పర్యటనలో అసలు ఎక్కడైనా గొడవలు జరిగాయా అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదా అని అడిగారు. జగన్‌పై ఇష్టారాజ్యంగా మాట్లాడిన టీడీపీ నేతల మీద కేసులు ఎందుకు పెట్టలేదని, చట్టం మీకు చుట్టమా అని ఆయన నిలదీశారు.