ఏలూరు(ప.గో): సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు కోడి పందాలకు అనుకూలం కాదని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు స్పష్టం చేశారు. సుప్రీం తీర్పులో యథాస్థితిని కొనసాగించడమంటే చట్టాలను అమలు చేయడమేనని పేర్కొన్నారు. ఈ కేసును హైకోర్టు పునర్విచారణ చేసిన అనంతరం ఇచ్చే ఆదేశాలను తప్పక పాటిస్తామన్నారు.
కోడి పందాల సమస్యను పరిష్కరించాలని హైకోర్టును దేశ అత్యున్నత ధర్మాసనం ఆదేశించిన సంగతి తెలిసిందే. కోడి పందాలు నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చడమే కాకుండా.. ఆ సమస్యను పరిష్కారించాలని హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. అప్పటివరకూ యథాతథ స్థితి కొనసాగుతుందని సుప్రీం స్పష్టం చేసింది.
'సుప్రీంకోర్టు తీర్పు కోడిపందాలకు అనుకూలం కాదు'
Published Mon, Jan 12 2015 1:36 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement