కోడి పందాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్! | Supreme Court gives green signal to cock fights | Sakshi
Sakshi News home page

కోడి పందాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్!

Published Mon, Jan 12 2015 12:37 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

కోడి పందాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్! - Sakshi

కోడి పందాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్!

న్యూఢిల్లీ : ఉత్కంఠకు తెరపడింది. కోడి పందాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోడి పందాలు నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.  ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ...సమస్యను పరిష్కరించాలని హైకోర్టును ఆదేశించింది. అప్పటివరకూ యథాతథ స్థితి కొనసాగుతుందని స్పష్టం చేసింది. కోడి పందేలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు  సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.


హైకోర్టు తీర్పు సంప్రదాయాలకు విఘాతం కలిగించేలా ఉందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. కోళ్లకు కత్తి కట్టకుండా, బెట్టింగులకు పాల్పడకుండా కోడి పందేలకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన సుప్రీంకోర్టును కోరారు.  పిటిషన్ను విచారించిన న్యాయస్థానం కోడిపందాలకు అనుమతి ఇవ్వటంతో పందెంరాయుళ్లు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement