
సమావేశంలో మాట్లాడుతున్న జేవీ సత్యనారాయణమూర్తి
సాక్షి, చిత్తూరు : అహంభావ పూరిత వైఖరితోనే కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలై, బీజేపీ విజయానికి కారణమైందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి అన్నారు. చిత్తూరులోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో జరిగిన సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశానికి ఆయిన ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలు పొందిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు రాబట్టుకోవడంలో విఫలమైందన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ అవలం బించే విధానాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి మూడో ప్రత్యామ్నాయం కోసం జనసేన పార్టీతో కలిసి పోటీ చేసినప్పటికీ అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోయామన్నారు. రానున్న కాలంలో ప్రజాసమస్యలపై పోరాడి పార్టీని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరముం దన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథరెడ్డి మాట్లాడుతూ బీజేపీ కంటే భిన్నమైన పాల న అందిస్తామనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పిం చడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. గత ప్రభుత్వంలో బీజేపీ అనుసరించిన ప్రజావ్యతిరేక విధానాలను వామపక్షాలు మాత్రమే పోరాటాల రూపంలో ఎండగట్టాయన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలన్నారు. భౌతిక వాద దృక్పథంతో బీజేపీ భావజాలాన్ని తిప్పికొ ట్టాలన్నారు. ఈ సమావేశానికి సీపీఐ డివి జన్ కార్యదర్శి నాగరాజన్ అధ్యక్షత వహించగా, జిల్లా కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment