తప్పులు కప్పిపుచ్చుకునేందుకే నాపై కేసులు | kakani govardan reddy fires on somireddy chandramohan reddy | Sakshi
Sakshi News home page

తప్పులు కప్పిపుచ్చుకునేందుకే నాపై కేసులు

Published Sat, Dec 31 2016 4:28 AM | Last Updated on Mon, Oct 22 2018 8:50 PM

kakani govardan reddy fires on somireddy chandramohan reddy

సోమిరెడ్డిపై కాకాణి ధ్వజం
పొదలకూరు: చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనపై పోలీసు కేసులు పెడుతున్నట్టు వైఎస్సార్‌సీపీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని పొదలకూరు మండలం నరసింహకండ్రికలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విదేశాల్లో అక్రమ మార్గంలో పెట్టుబడులు పెట్టిన సోమిరెడ్డి అవినీతిని ఆధారాలతో సహా బయటపెడితే, టీడీపీ ప్రభుత్వం ఉంది కదా అని తనపై పోలీస్‌స్టేషన్లలో కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు.

తద్వారా తనను బెదిరించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఎన్ని కేసులు పెట్టినా తాను వెనుకంజ వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ జరిపించుకోవాలని, అలాకాకుండా ఆరోపించిన వ్యక్తిని నిరూపించమనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పొదలకూరు ఎంపీపీ కోనం బ్రహ్మయ్య, ఇతర నేతలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement