ఖరీఫ్..కన్నీరేనా?
- జూలై నెలాఖరుకు వర్షాలు పడకుంటే రైతులకు కష్టకాలమే
- ప్రత్యామ్నాయ పంటలపై అధికారుల అత్యవసర సమావేశం
- విత్తనాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు
అతివృష్టి.. అనావృష్టి అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. వరుసగా నాలుగో ఏటా పరిస్థితి అగమ్యగోచరంగా కనిపిస్తోంది. వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో అప్పుడే కరువు ఛాయలు అలముకున్నాయి. జూలై నెలాఖరుకు కూడా వరుణుడు కరుణించకుంటే పరిస్థితి దయనీయమే. దీంతో వ్యవసాయాధికారులు శనివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సిద్ధం చే శారు. స్వల్పకాలిక వంగడాలు, ఆరుతడి పంటలకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించనున్నారు.
కానరాదు. ఏటా వీటి నుంచి రూ. కోట్లలో ఆదాయం రావాల్సి ఉన్నా రూ. లక్షలకు మించడం లేదన్నది అధికారుల వాదన. వీటన్నింటినీ అధిగమించేందుకు లెక్కలన్నీ పక్కాగా చేసేందుకు ప్రభుత్వం ఆన్‌లైన్ విధానం అమల్లోకి తెచ్చింది. ఇటీవల ఆశాఖ మంత్రి అధికారులను ఆదేశించారు.
ఆలయభూముల వివరాలు, ఏటా వచ్చే ఆదాయం, సిబ్బంది, ఇతర వ్యయ వివరాలు పూర్తిగా
ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. దీనివల్ల ఏటా వచ్చే ఆదాయంతో పాటు ఖర్చు వివరాలు పక్కాగా తెలుస్తాయి. వీటిని నేరుగా వైబ్‌సైట్‌లో ఎక్కడినుంచైనా, ఎవరైనా పరిశీలించేటట్టు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతవరకు ఆలయాల ఆస్తులు, ఆదాయం, ఖర్చుల వివరాలను ఏడాదికోసారి దేవాలయ ప్రాంగణంలోని నోటీసు బోర్డుపై ఉంచేవారు. దీనిని క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం లేకపోవడంతో ఎక్కువ శాతం ఆలయ అధికారులు, సిబ్బంది కొంతమేర దుర్వినియోగానికి పాల్పడే వారనే వాదన ఉంది.
అదేవిధంగా ఆలయానికి సంబంధించిన భూములను ఏళ్ల తరబడి ఒకే వ్యక్తికి కౌలుకిచ్చి కొంతమేర సొమ్మును స్వాహా చేసేవారనే ఆరోపణలున్నాయి. వీటితో పాటు ఏటా నిర్వహించే ఆడిట్‌ను సైతం కొంతమంది దేవాలయ అధికారులు నిర్లక్ష్యం చేసేవారు. ఈ జమా ఖర్చుల్ని తేల్చలేక ఆడిట్ అధికారులు సైతం చేతులేత్తేసే పరిస్థితి. ఆడిట్‌లోని అభ్యంతరాలు సైతం దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని వైనం అందరికీ స్పష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్‌లైన్ విధానంతో గతంలో చోటుచేసుకున్న నిర్వాకాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఇందులో భాగంగా ఇప్పటికే ఆలయాలకు చెందిన ఆస్తులు, మాన్యాలు, భూములు, అభరణాల వివరాలను నమోదు చేస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే ఆదాయ, వ్యయ వివరాలను నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితుల్లో ఇక నుంచి ప్రభుత్వంతో పాటు ప్రజలకు సైతం జవాబుదారీగా ఉండాల్సిన వస్తుందని ఆలయ అధికారులు భయపడుతున్నారు.