
చంద్రబాబుకు కత్తి పద్మారావు హెచ్చరిక
గుంటూరు: గుంటూరు- విజయవాడల మధ్య ఏపీ రాజధాని నిర్మించాలని లేదంటే తెలంగాణ ఉద్యమాన్ని మించి పెద్ద ఉద్యమం చేస్తామని దళిత మహాసభ అధ్యక్షుడు కత్తి పద్మారావు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని హెచ్చరించారు. మంత్రి నారాయణకు చంద్రబాబు తొత్తుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాను రాజధాని చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తే ఆంధ్రప్రదేశ్‌కు బౌద్ధప్రదేశ్ అని పేరుపెట్టాలని విభజనపై ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందానికి గతంలో కత్తి పద్మారావు నివేదిక ఇచ్చారు. గుంటూరు జిల్లాలోని అమరావతిని రాజధాని చేయాలని కూడా ఆయన గతంలోనే కోరారు.