టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేసేది వ్యవసాయం కాదని, గంజాయి సాగని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు.
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేసేది వ్యవసాయం కాదని, గంజాయి సాగని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పురపాలక సంఘం మాజీ వైస్‌చైర్మన్ రమేష్ కుమార్, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తసీయుద్దీన్ శనివారం టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎన్‌టీఆర్ భవన్‌లో జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు. కాగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్‌టీఆర్ భవన్‌లో వివిధ రంగాలకు చెందిన మహిళలను సత్కరించారు. వికలాంగుకుల ఆర్థిక సాయం చేశారు.