విజయనగరం వ్యవసాయం: ఖరీప్ సీజన్ ప్రారంభం అయింది. రైతు చేతిలో చిల్లిగవ్వ లేదు. ప్రభుత్వంపై గంపెడాశలు పెట్టుకున్న రైతన్నను చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడం లేదు. దీంతో ఖరీఫ్ సాగు ఏవిధంగా చేపట్టాలో తెలియక రైతులు సతమతమవుతున్నారు. రుణమాఫీ అవుతుంది, రుణాలు తిరిగి ఇస్తారని రైతులుభావించారు కానీ అది నేరవేరలేదు. కొంతమంది రైతులకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మరికొంతమందిని విస్మరించింది. ఈలోగా రుణమాఫీ కాని రైతులు దరఖాస్తుచేసుకోవాలని చెప్పడంతో జిల్లాలో 25వేల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వారంతా దరఖాస్తు చేసి నెలరోజులు దాటినా ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో రుణమాఫీ అవుతుందో, లేదో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు.
చిల్లిగవ్వలేక అవస్థలు పడుతున్న రైతులు
ఇప్పటికే చాలా మంది రైతులు విత్తనాలు వేశారు. మరికొంతమంది రైతులు ఎద జల్లుతున్నారు. చెరుకు, మొక్కజొన్న పంటలు కూడా సాగులో ఉన్నాయి. వరి పంటకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో వర్షాలు పడినట్లయితే రైతులు దమ్ము పట్టడానికి సిద్ధం అవుతున్నారు. అయితే ప్రస్తుతం రైతుల దగ్గర పైసాలేదు. రుణమాఫీ కాకపోవడం వల్ల వారికి బ్యాంకులు రుణాలు ఇవ్వడం మానేశాయి. దీంతో రైతులు వడ్డీ వ్యాపారులనే ఆశ్రయిస్తున్నారు.
రూ.15 వేల వరకు ఖర్చు
ఎకరా భూమిలో వరి పంట సాగు చేయడానికి రూ.15వేల నుంచి రూ.18 వేలు ఖర్చవుతుంది. ఈ నేపథ్యంలో పెట్టుబడుల కోసం రైతులు ప్రైవేటు వ్యాపారులే తమకు దిక్కుని అంటున్నారు.
‘రుణమాఫీ’కి మోక్షమెప్పుడు?
Published Thu, Jul 9 2015 12:36 AM | Last Updated on Sun, Sep 3 2017 5:08 AM
Advertisement
Advertisement