విజయనగరం అర్బన్ : జిల్లాలోని రుణమాఫీ రైతులకు బహుళ ఖాతాలు గుదిబండగా మారాయి. తొలుత అన్ని బ్యాంకుల్లోనూ నాలుగు ఖాతాల వరకూ మాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా ఒక్క ఖాతాకే మాఫీ అంటూ ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందు తున్నారు. మొదటి దశలో మాఫీ అర్హత పొందిన 1. 44 లక్షల రైతులకు జిల్లాలో 390 కోట్ల రూపాయలు రుణంగా వెల్లడించారు. ఈ మొత్తం లో తొలి విడతగా రూ. 184. 6 కోట్లు జమ జేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రైతులు రుణ లబ్ధి పొందారని ప్రచారం చేసింది. ఖాతాల్లో జమ వేసే ముందు వారందరి నుంచి అఫిడివిట్ (రుణంపై ఎలాంటి తేడా వచ్చినా ఖాతారుడే బాధ్యతపడే ఒప్పందం) తీసుకోవా లని బ్యాంకర్లను ఆదేశించింది. అయితే ఇంతవరకు కేవలం 15 శాతం మంది మాత్రమే జిల్లాలో అఫిడివిట్ తీసుకున్నారని తెలుస్తోంది. వీటి లో బహుళ ఖాతాలున్న వారే అధికంగా ఉన్నట్టు సమాచారం.
తాజాగా ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు.. బహుళ ఖాతాలున్న రైతు లు ఒక పాసు పుస్తకానికి ఒక్క రుణాన్ని మాత్రమే ఎంచుకోవాలి. దీంతో మొదటి విడత మాఫీ లబ్ధిదారుల సంఖ్య భారీగా తగ్గింది. తగ్గిన లబ్ధిదారుల సంఖ్యను జిల్లాస్థాయిలో లెక్కలు సేకరించాల్సి ఉందని లీడ్ బ్యాం క్ అధికారులు చెపుతున్నారు. జిల్లాలో సుమారు 60 మంది శాతం రైతులు ఒకే పాసు పుస్తకంపై రెండు కం టే అధికంగా రుణాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. వాటి విభజన వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని చెబుతున్నారు. ఈ లెక్కన మొదటి విడత రుణమాఫీ జమ చేయాల్సిన మొత్తం 184.6 కోట్ల రూపాయల్లో సుమారు 60 శాతం మేర కు మాఫీ భారం తగ్గినట్టే. ఎప్పటికప్పుడు అమలులోకి తెస్తున్న నిబంధనలపై రైతుకు అవగాహన కల్పించకపోవడం వల్ల రైతుకి రుణంపై వడ్డీ భారం పెరుగుతోంది. ప్రభుత్వ లెక్కల మేరకు మొదటి విడత రుణమాఫీ ప్రక్రియ పూర్తయినట్లే.
10 రోజులైనా ఇంకా జమ కాని సొమ్ము
రుణమాఫీ అమల్లో అంతా గందరగోళం నెలకొంది. ఎవరికి ఎందుకు మాఫీ కాలేదో.. ఎందుకు మాఫీ అయిందో బ్యాంకర్లు కూడా చెప్పలేని స్థితిలో ఆన్‌లైన్‌లో మాఫీ జాబితా విడుదలైంది. మొదటి జాబితా విడుదల చేసి పది రోజులు అవుతున్నా ఇంతవరకు దానికి సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. మాఫీ అయిపోయినట్టు ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా సొమ్ములు ఇంకా జమ కాలేదని బ్యాంకర్లు చెబుతున్నారు. మొదటి దశ మాఫీ జాబితాలో పేర్లు లేని రైతులు ఆందోళన చెందవద్దు...రెండో దశ జాబితా ఉంది.. అందులో మీ అందరికీ మాఫీ అవుతా యి.. ఇందుకోసం మీరు మళ్లీ సంబంధిత ధ్రువీకరణ పత్రాలు ఇవ్వనవసరం లేదు..
అన్నీ బ్యాంకర్లే చూసుకుంటారు... వెబ్ సైట్లో అప్‌లోడ్ చేస్తారంటూ చెప్పిన చంద్రబాబు సర్కారు మళ్లీ మాట మార్చడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. సాంకేతిక కారణాలతో ఈ సమస్య తలెత్తిందని, అభ్యంతరాలు సరిచేసి జనవరి 10వ తేదీన వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్టు ప్రభుత్వం తొలుత ప్రకటించడంతో మాఫీ కోసం ఎదురుచూసే రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ ప్రకటన మీద నిలబడకుండా సర్కారు మళ్లీ కుప్పిగంతులేస్తోంది. అన్ని ధ్రువీకరణ పత్రాలతో పాటు జన్మభూమి కమిటీ ఓకే చేయాలని కొత్త ముడి వేయడంతో బ్యాంకర్లలోనూ గందరగోళం నెలకొంది.
అంతా అయోమయం!
Published Mon, Jan 12 2015 12:31 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM
Advertisement