హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సమావేశాలకు డుమ్మా కొట్టారు. దాంతో అసెంబ్లీ కార్యదర్శి సదారాం ముసాయిదా బిల్లు అంశాల వివరాలను సభ్యులకు చదవి వినిపించారు. ముఖ్యమంత్రికి అస్వస్థత కారణంగానే సభకు హాజరు కాలేదని సమాచారం.
కాగా నిన్నతెలంగాణ మంత్రులకు అపాయింట్ మెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఆ తర్వాత రద్దు చేసిన విషయం తెలిసిందే. సీఎం ఉద్దేశపూర్వకంగానే చేశారని అపాయింట్మెంట్ రద్దు చేశారని తెలంగాణ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
డుమ్మా కొట్టిన సీఎం కిరణ్, చంద్రబాబు
Published Mon, Dec 16 2013 11:15 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement