నిలదీయాల్సిన బాబు లేరు: శోభానాగిరెడ్డి | Where is Kiran Kumarar Reddy? : Sobhanagireddy | Sakshi
Sakshi News home page

నిలదీయాల్సిన బాబు లేరు: శోభానాగిరెడ్డి

Published Mon, Dec 16 2013 8:58 PM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM

నిలదీయాల్సిన బాబు లేరు: శోభానాగిరెడ్డి - Sakshi

నిలదీయాల్సిన బాబు లేరు: శోభానాగిరెడ్డి

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు కారణంగా ఈరోజు శాసనసభ జరిగిన తీరును దృష్టిలోపెట్టుకొని సభ గౌరవాన్ని కాంగ్రెస్‌ మంటగలిపిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు  శోభానాగిరెడ్డి మండిపడ్డారు.  ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి  ఎక్కడ? అని ఆమె ప్రశ్నించారు.  ముఖ్యమంత్రిది చేతగానితనం అని విమర్శించారు. నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎందుకు సభలోలేరని ఆమె అడిగారు.

సభ అనుమతి లేకుండా బిల్లును తీసుకురావడాన్నితాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. సభలో సభ్యులు ఎందుకు ఆందోళన చేస్తున్నారో కనుక్కునే వారు లేరని బాధపడ్డారు. బీఏసీ పెట్టిన తర్వాత బిల్లును చర్చకు పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement