
సీఎం కిరణ్ అధిష్టానం మనిషే: జేసీ దివాకర్‌రెడ్డి
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నూటికి నూరు శాతం కాంగ్రెస్ అధిష్టానం మనిషేనని మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎల్పీ కార్యాలయ ఆవరణలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
సీమాంధ్ర ప్రజల్లో బలంగా సమైక్యవాదం ఉన్నందున అధిష్టానానికి అదే చెబుతున్నారని, రేపు హైకమాండ్ పిలిస్తే ఢిల్లీ వెళ్లి రాష్ట్రంలో నెలకొన్న సమైక్య అనుకూల, ప్రతికూల పరిస్థితులను వివరిస్తారని పేర్కొన్నారు. కిరణ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తారంటూ వస్తున్న వార్తలను జేసీ కొట్టిపారేశారు. 2014 వరకు కిరణే సీఎంగా కొనసాగుతారన్నారు. కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి తనకు వ్యక్తిగతంగా సన్నిహితుడని, రాయలసీమకు చెందిన ఆయన సీఎం అయితే స్వాగతిస్తానని చెప్పారు.