సమైక్య చాంపియన్ అనిపించుకోవడం, వలసలు నిరోధించడమే కిరణ్ లక్ష్యం?
శ్రీధర్‌బాబుపై నిజంగా కోపమే ఉంటే కీలకమైన వాణిజ్య పన్నుల శాఖ ఇస్తారా?
శైలజానాథ్‌ను కూడా సమైక్య రేసులో నుంచి తప్పించే యత్నమని గుసగుస
సాక్షి, హైదరాబాద్: మరో రెండ్రోజుల్లో శాసనసభ సమావేశాలు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. ఈ తరుణంలో ఉన్నట్లుండి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర మంత్రివర్గ శాఖల్లో ఆకస్మిక మార్పులు చేయుడం వెనుక కారణమేంటి?... ప్రస్తుతం ఇదే అంశం హాట్ టాపిక్‌గా వూరింది. ఇప్పటికే సమైక్యవాదినని చెప్పుకొనేందుకు అనేక పాట్లుపడుతున్నా సొంతపార్టీ నేతలెవ్వరూ నవ్ముక పోవడం, చివరకు నిన్నటివరకు తన వెంట ఉన్నవారు కూడా పార్టీని వీడేందుకు సిద్ధమవుతుండడంతో కిరణ్ మరో ఎత్తుగడకు తెరతీశారు. ఒకవైపు సమైక్యవాదిగా, మరో వైపు వలసలను నిరోధించి చివరి క్షణం వరకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలనే ఆకాంక్షతోనే సీఎం సరికొత్త డ్రావూను ఆడుతున్నట్లు తెలుస్తోంది. విభజన ప్రక్రియును సాఫీగా పూర్తిచేస్తానని ఒకవైపు అధిష్టానానికి హామీ ఇస్తూనే అదే సమయంలో సీవూంధ్రలో తన గ్రాఫ్ పడిపోకుండా ఉండేందుకు పైకి సమైక్యవాదినని చెప్పుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. విభజన నిర్ణయం జరగదని, బిల్లు రాదని.. ఇలా పలురకాలుగా చెబుతున్నా అందుకు భిన్నంగానే విభజన ప్రక్రియ ముందుకు సాగుతుండటం.. చివరకు అసెంబ్లీలో విభజన బిల్లు కూడా చర్చకు వచ్చిన నేపథ్యంలో సీఎంపై సొంత పార్టీ నేతలందరికీ విశ్వాసం సన్నగిల్లింది. ఎవరికి వారు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు.
కోపమే ఉంటే ఆ శాఖ ఎలా ఇస్తారు?
అసెంబ్లీ ప్రొరోగ్ వివాదం, విభజన బిల్లుపై చర్చను ప్రారంభించానని శ్రీధర్‌బాబు చెప్పడం సీఎంకు కోపం తెప్పించిందని, అందుకే ఆయనను సభావ్యవహారాల శాఖ నుంచి తప్పించారని సీఎం వర్గీయుులు పైకి ప్రచారం చేస్తూ కిరణ్‌కువూర్‌రెడ్డికి మైలేజీ తెచ్చేందుకు ప్రయుత్నిస్తున్నారు. కానీ లోతుల్లోకి వెళ్తే వూత్రం.. సీఎం ఆకస్మిక చర్యల వెనుక ఇటు తెలంగాణ, అటు సీవూంధ్ర ప్రాంత నేతలకు ఉభయుతారకంగా ప్రయోజనాలున్నట్లు స్పష్టవువుతోంది. శాసనసభలో సమైక్యభావానికి వ్యతిరేకంగా వ్యవహరించినందుకే శ్రీధర్‌బాబుపై చర్యలు తీసుకున్నానని పైకి చెప్పుకోవడం ద్వారా సమైక్య చాంపియున్‌గా నిలబడొచ్చని సీఎం వ్యూహంగా కన్పిస్తోంది. అదే సవుయుంలో సభా నాయుకుడిగా పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టే ఇబ్బంది లేకుండా వుుందుగానే ఆ పనిచేసిన శ్రీధర్‌బాబుకు కీలకమైన వాణిజ్య పన్నుల శాఖను కట్టబెట్టి పదోన్నతి కల్పించినట్లు అయ్యింది. శ్రీధర్‌బాబుపై సీఎంకు కోపమే ఉంటే కనుక పౌరసరఫరాల శాఖను అలాగే ఉంచి కేవలం నామ మాత్రమే అరుున సభావ్యవహారాల శాఖను తప్పిస్తారా? వాస్తవానికి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కిరణ్‌కువూర్‌రెడ్డి వాణిజ్య పన్నుల శాఖను ఎవరికీ కేటారుుంచకుండా తన వద్దనే ఉంచుకున్నారు. అలాంటి శాఖను శ్రీధర్‌బాబుకు ఇచ్చి పదోన్నతి కల్పించడం వెనుక అసెంబ్లీలో పునర్వ్యవస్థీకరణ బిల్లుపై తనకు ఇబ్బందులు లేకుండా చూసినందుకేనని తేటతెల్లవువుతోంది.
ఆ వ్యూహం ఇదే..: శ్రీధర్‌బాబు నుంచి తప్పించిన సభావ్యవహారాల శాఖను పాఠశాల విద్యాశాఖ వుంత్రి శైలజానాథ్‌కు అప్పగించడం వెనుక కూడా సీఎం వ్యూహం దాగి ఉందని సీవూంధ్ర నేతలు చెబుతున్నారు. శాసనసభలో పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చను అడ్డుకుంటావుని సమైక్యవాదాన్ని వినిపిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ తదితర పార్టీలు ప్రకటించారుు. శుక్రవారం నుంచి జరిగే సభలో బిల్లుపై చర్చను సమైక్యవాదులు అడ్డుకుంటే వారిపై సభలో సస్పెన్షన్ వంటి చర్యలు తీసుకోవాలంటే సభావ్యవహారాల శాఖ వుంత్రే తీర్మానం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఇప్పటివరకు సమైక్యాంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధుల ఫోరం నేతగా వ్యవహరిస్తున్న శైలజానాథ్‌కు సభా వ్యవహారాల శాఖను అప్పగించి సమైక్యవాదులపై చర్యలను ఆయున చేతనే చేపట్టించేటట్లు చేసి తానొక్కడినే సమైక్య చాంపియున్ అనిపించుకొనేందుకే ఈ ఎత్తుగడ వేసినట్లు కనిపిస్తోంది. వుంత్రివర్గ శాఖల్లో వూర్పులు చేర్పులు పరిపాలనా పరంగానే జరిగినట్లుగా భావించడానికీ వీలులేదంటున్నారు. హోమ్, ఎక్సైజ్, విద్యుత్తు వంటి కీలక శాఖలు అన్నీ తన వద్దనే ఉంచుకొని కేవలం కొన్ని వూర్పులను వూత్రమే సీఎం చేయుడం వెనుక కేవలం సమైక్యవాద డ్రావూను నడిపించడానికేనని అభిప్రాయుపడుతున్నారు. తనపై విశ్వాసం సన్నగిల్లి ఎమ్మెల్యేలంతా వలసపోతే చివరి వరకు తాను సీఎంగా కొనసాగుతానో లేదోనన్న భయుంతో ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది.
నాకు తెలియదు:శ్రీధర్‌బాబు
శాసనసభ వ్యవహారాల శాఖ బాధ్యతల నుంచి తనను తప్పించినట్లు తెలియదని డి.శ్రీధర్‌బాబు అన్నారు. ఇప్పటి వరకు తనకు అధికారిక సమాచారమేదీ అందలేదని చెప్పారు. కేబినెట్‌లో ఆకస్మిక మార్పులు చేసిన విషయాన్ని మంగళవారం రాత్రి ‘సాక్షి’ ప్రతినిధి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకెళ్లగా టీవీల్లో చూడటమే తప్ప అధికారిక సమాచారం లేదన్నారు.
ఈ మార్పూ డ్రామానే!
Published Wed, Jan 1 2014 1:41 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement