హైదరాబాద్‌లో జీవ వైద్య పరిశోధనా కేంద్రం | central cabinet bio medical reaserch agree by center | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో జీవ వైద్య పరిశోధనా కేంద్రం

Published Wed, Nov 18 2015 7:52 PM | Last Updated on Tue, Jun 4 2019 5:02 PM

central cabinet bio medical reaserch agree by center

న్యూఢిల్లీః హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీలో జీవ వైద్య పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. 338.58 కోట్ల రూపాయల ఖర్చుతో నేషనల్ రీసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో-మెడికల్ రీసెర్చ్ (ఎన్‌ఏఆర్‌ఎఫ్)ని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఈ కేంద్రం 2018-19 నాటికి అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు.

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రిమండలి ఈ నిర్ణయం తీసుకుంది. జీవవైద్య పరిశోధనలో అత్యున్నత ప్రమాణాలతో నెలకొల్పే ఈ తరహా కేంద్రం దేశంలో ఇదే మొదటిది. ఈ పరిశోధన కేంద్రం కోసం రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో 102.69 ఎకరాల స్థలాన్ని ఉచితంగా కేటాయించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement