సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండూరి రవీందర్‌రావును పదవి నుంచి తొలగించడం ఖాయమైంది. తెలంగాణ రాష్ట్రం తమ వల్లే వచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఈ నెల 24న జిల్లాలో నిర్వహించతలపెట్టిన జైత్రయాత్ర సదస్సులోపే ఈ మార్పు జరిగే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ ముఖ్యనేతలు చెబుతున్నారు. సదస్సు ఏర్పాట్లలో ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తే మాత్రం... ఈ కార్యక్రమం తర్వాత మార్పు ప్రక్రియ ఉంటుందని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రకటన తర్వాత పార్టీ పరంగా ఆశించిన కార్యక్రమాలు లేకపోవడం, అప్పుడప్పుడు ఏదైనా కార్యక్రమం నిర్వహించినా కాంగ్రెస్ పార్టీ ఘనతలుగా కాకుండా ఒకరిద్దరి తరపున మాట్లాడే వ్యక్తిగా ముద్రపడడం, సొంత నియోజకవర్గం సిరిసిల్లలో గ్రూపు రాజకీయాలు... కలిసి కొండూరి పదవికి ఎసరు వచ్చినట్లు తెలుస్తోంది. సాధారణ ఎన్నికలను ఎదుర్కొనే సమర్థుడైన మరో నాయకుడి పేరును డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఏకాభిప్రాయంతో సూచిం చాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కొన్నిరోజుల క్రితమే మంత్రి శ్రీధర్‌బాబుకు చెప్పినట్టు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఎవరి పేరు చెప్పాలనే విషయంలో స్పష్టత రాకపోవ డం వల్లే రవీందర్‌రావును మార్చడంలో ఆలస్యమవుతోందని పేర్కొంటున్నారు.
ఇప్పుడు కాకు న్నా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక పీసీసీలు ఏర్పాటయ్యే సమయంలో అయినా మార్పు జరుగుతుందని చెబుతున్నారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రె స్ కార్యక్రమాలను ఆశించిన మేర జరపకపోవ డం వల్లే కొండూరి రవీందర్‌రావును పదవి నుంచి తప్పించాలని అధిష్టానం నిర్ణయించిన ట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తర్వాత కూడా కాంగ్రెస్‌కు ప్రయోజనం కలిగే కార్యక్రమాలను రవీందర్‌రావు నిర్వహిం చిన పరిస్థితులు లేవు. మొదటి నుంచి తెలంగాణవాదం ఎక్కువగా ఉన్న జిల్లాలో పరిస్థితులను అనుకూలంగా మలుచుకుని టీఆర్‌ఎస్‌కు దీటు గా కార్యక్రమాలు నిర్వహించకపోవడంపై జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన చేసిన తర్వాత అన్ని జిల్లాల్లో సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపే సదస్సులు నిర్వహించారు. మన జిల్లాలో మాత్రం... సర్పంచులకు సన్మానసభ మాత్రమే నిర్వహించారు. సోనియాగాంధీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఎం దుకనే ఉద్దేశంతో సర్పంచుల సన్మానసభలోనే సోనియాగాంధీకి కృతజ్ఞతలు అని ఓ తీర్మానం చేసి వదిలేశారు. జిల్లాలోని పార్టీ ప్రధాన నేతల అనుమతితోనే ఇలా చేసినట్లు రవీందర్‌రావు వర్గీయులు చెబుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి ఈ విషయంపై ఫిర్యాదులు వెళ్లాయి. ఎన్నికల తరుణంలో మరింత క్రియాశీలంగా ఉండాల్సిన అధ్యక్షుడి తీరు దీనికి విరుద్ధంగా ఉందని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.
డీసీసీ అధ్యక్షుడిగా రవీందర్‌రావు వ్యవహారశైలి సరిగా ఉండడం లేదని వివరించారు. సొంత నియోజకవర్గం సిరి సిల్లలోనే మిగిలిన నాయకులను కలుపుకునిపోవడంలో విఫలమవుతున్నారని, గత నెలలో జరి గిన పలు సంఘటనలను వివరిస్తూ గతంలోనే ఫిర్యాదులు వెళ్లాయి. సాధారణ ఎన్నికల దగ్గరపడుతున్నా... నెలకోసారి కూడా జిల్లా పార్టీ ఆఫీసులో సమావేశాలు గానీ, కార్యక్రమాలు గానీ జరగడం లేదు. డీసీసీ అధ్యక్ష పదవి నుం చి మార్చుతున్నట్లు తెలిసినందువల్లే రవీందర్‌రావు ఇటీవల పార్టీ జిల్లా కార్యాలయంలో కార్యక్రమాలను పూర్తిగా తగ్గించినట్లు ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. జోడు పదవుల అం శం కూడా ఆయనకు ఇబ్బందిగా మారింది. కేడీసీసీబీ అధ్యక్షుడిగా డీసీసీ అధ్యక్షుడిగా రెండు పదవుల్లో ఆయన కొనసాగుతున్నారు. రవీందర్‌రావును పదవినుంచి తప్పించడం ఖాయమవడంతో తదుపరి ఈ పదవికి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణగౌడ్, నేరెళ్ల శారద, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, కె.సుదర్శన్‌రెడ్డి, తుమ్మేటి సమ్మిరెడ్డి, హెచ్.వేణుగోపాల్‌రావు పేర్లను పరిగణనలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రవీందర్‌రావు సామాజిక వర్గానికే మళ్లీ పదవిని ఇచ్చే పరిస్థితి వస్తే ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, సునీల్‌రావుకు అవకాశాలు ఉంటాయి. సాధా ర ణ ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్‌కు మళ్లీ పదవి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే ప్రచారం కూడా జరుగుతోంది. పదవుల ఎంపికలో ఆశ్చర్యం కలిగించే కాంగ్రెస్‌లో అనూహ్యంగా ఇతర నేతల పేర్లు పరిశీలనలోకి వచ్చే అవకాశం సైతం ఉందని పార్టీశ్రేణులు అంటున్నాయి.
కొండూరి... కొన్ని రోజులే!
Published Thu, Oct 17 2013 4:38 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement