కృష్ణా డెల్టాలో కరువు ఛాయలు | Krishna Delta shades of drought | Sakshi
Sakshi News home page

కృష్ణా డెల్టాలో కరువు ఛాయలు

Published Sun, May 1 2016 2:18 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

కృష్ణా డెల్టాలో కరువు ఛాయలు - Sakshi

కృష్ణా డెల్టాలో కరువు ఛాయలు

రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల కృష్ణా డెల్టా పూర్తిగా ఎండిపోయిందని వైఎస్సార్‌సీపీ మైలవరం....

వైఎస్ జగన్‌ను కలిసిన
పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్

 
సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల కృష్ణా డెల్టా పూర్తిగా ఎండిపోయిందని వైఎస్సార్‌సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌కు విన్నవించారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత, శాసనసభా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను రమేష్ కలిశారు.  కృష్ణా జిల్లాలో రైతులుకు సాగు నీరు, ప్రజలకు తాగునీరు ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జగన్‌కు వివరిం చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిమట్టం పడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు.

అలాగే సీఆర్‌డీఏలో గ్రీన్‌బెల్ట్ పేరుతో రైతులకు అన్యాయం చేస్తున్నారని వివరించారు. అనంతరం రమేష్ సాక్షితో మాట్లాడుతూ కృష్ణా,గోదావరి డెల్టాల పరిరక్షణ కోసం ఈనెల 16 నుంచి 18 వరకు  కర్నూలులో వైఎస్ జగన్ చేస్తున్న దీక్షకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో తరలివెళ్తామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement