సిలిండర్ పేలుడు ఘటనపై కలెక్టర్ సీరియస్ | krishna district collector serious about chittinagar gas-cylinder blast | Sakshi
Sakshi News home page

సిలిండర్ పేలుడు ఘటనపై కలెక్టర్ సీరియస్

Published Tue, Jan 20 2015 10:55 AM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM

krishna district collector serious about chittinagar  gas-cylinder blast

విజయవాడ : విజయవాడ చిట్టినగర్లో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు ప్రమాదంపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు.  ఈ సంఘటనకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. చిట్టినగర్లో మంగళవారం ఉదయం గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

 

విజయవాడ కేఎల్ రావు నగర్‌లోని ఓ ఇంట్లో వంట చేస్తుండగా మంగళవారం ఉదయం సిలిండర్ పేలింది. ఈ ఘటనలో దంపతులు కోరాడ రాంబాబు అలియాస్ రమణ, నిర్మలతోపాటు రమణమ్మ చనిపోయారు. గాయాల పాలైన నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి మూడు అంతస్తుల ఆ భవనంలో రెండు అంతస్తులు ధ్వంసమయ్యాయి. కాగా, గ్యాస్ లీకేజీ కారణంగా పేలుడు సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. సంఘటనా స్థలాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ సందర్శించి, బాధితులను పరామర్శించారు.


మరోవైపు ఈ సంఘటనపై బాధితులు మాట్లాడుతూ భారత్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. గ్యాస్ లీక్ అవుతుందని నాలుగు రోజులుగా డిస్ట్రిబ్యూటర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement